షోలో టాప్ డైరెక్టర్ తాట తీసిన హీరోయిన్

Update: 2017-02-20 15:57 GMT
మనకిక్కడ సురేశ్ బాబు.. దిల్ రాజు ఎలానో బాలీవుడ్ కు మొనగాడైన దర్శక నిర్మాత ఎవరైనా ఉన్నారంటే కరణ్ జోహార్ పేరు ముందు ఉంటుంది. ఓపక్క సినిమాలు తీస్తూనే.. మరోవైపు షోలు నిర్వహించే అతగాడికి సంబంధించి.. కాఫీ విత్ కరన్ షో చాలా ఫేమస్. తన షోకు అగ్ర నటీనటుల్ని పిలిపించి.. చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేసి.. తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాడు.

అలాంటి షోకి తాజాగా వచ్చిన ‘క్వీన్’ కంగనా రౌనత్ నవ్వుతూ మాట్లాడినట్లే మాట్లాడుతూ.. కరన్ ను ఉతికి ఆరేసినంత పని చేసింది. ఆమె మాటల తీవ్రత ఎంతంటే.. ఈ షోను నిర్వహిస్తున్న కరన్ ముఖంలో నవ్వు కూడా మాయమైనంత. సాధారణంగా తన షోకు అతిధులుగా వచ్చే వారిని తనప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే కరన్ కు.. అందుకు భిన్నమైన అనుభవాన్ని మిగిల్చింది కంగనా.

ఆమె మాటలకు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు కరన్. ఇంతకీ.. అంతగాకంగనా ఏం చెప్పిందంటారా.. తన జీవితంలో విలన్ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది కరన్ అని తేల్చేసిన ఆమె.. తన బయోపిక్ తీస్తే.. అందులో విలన్ పాత్ర కరన్ దేనని.. ఆ పాత్రను అతడే పోషిస్తే మరింత బాగుంటుందని తేల్చి చెప్పింది. కొత్త టాలెంట్  పరిశ్రమలోకి రానివ్వడని.. తన వాళ్లనేఎప్పుడూ మోస్తుంటాడని ఘాటుగా వ్యాఖ్యలు చేసిన క్వీన్.. కరన్ ను మాఫియాగా నవ్వుతూ అభివర్ణించేయటానికి వెనుకాడలేదు.

తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తన ఇంగ్లీష్ ని కామెంట్ చేశాడని.. అందుకే  తాను ఇంగ్లిష్ మీద దృష్టి పెట్టి మరీ తన భాషను మరింత మెరుగుపర్చుకున్న విషయాన్ని ఆమె వెల్లడించారు. ఇంతలా తన గురించి చెబుతుండటంతో కరన్ ముఖంలో నవ్వు మాయమైంది. ఇక.. ముగ్గురు ఖాన్లలో ఎవరితో నటిస్తావని అడిగినప్పుడు.. తాను ఎవరితోనూ నటించనని తేల్చేసింది. ఖాన్ల సినిమాలో తనకు గుర్తింపు ఉండే పాత్ర లేకపోతే చేయనని చెప్పిన ఆమె అంత బోల్డ గా మాట్లాడటం.. కరన్ నే కాదు.. ఈ షోకు వచ్చిన మరో గెస్ట్ సైఫ్ అలీ ఖాన్ సైతం తెగ ఇబ్బంది పడిపోయిన వైనం కనిపించింది. మొత్తానికి తన ఘాటు మాటలతో క్వీన్ తానేంటో మరోసారి చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి. కంగనానా మజాకా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News