'ఆదర్శ కుటుంబం' మూవీలో ఆ ఒక్కటి ఎక్కువయ్యేలా ఉందిగా...
విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం సినిమా ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం సినిమా ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా అనౌన్స్ మెంట్ నుంచి భారీ బజ్ క్రియేట్ చేసుకుంది. దసరా కనుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా రెండుసార్లు రిలీజ్ వాయిదా వేసుకుంది. ఈ సినిమా పకడ్బందీ ప్రణాళికలతో ప్రేక్షకుడిని థియేటర్లకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. త్రివిక్రమ్ మరోసారి తన మార్క్ డైలాగులతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయడానికి సిద్ధమయ్యాడు...
వైలెన్స్ ఎక్కువైందా?
ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాబోతోందనే వార్తలు వినిపించాయి. దానికి తోడు సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్ లలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడతారనే విషయాలను ఎలివేట్ చేసి చూపించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో మాత్రం వైలెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. వెంకటేష్ చాలా వైలెంట్ గా కనిపిస్తూనే తన ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. తను ఎలాంటి వారితో పోటీకి పడాల్సి వచ్చింది. ఫైనల్ గా తమ ఫ్యామిలీ ని సేవ్ చేసుకున్నాడా? దాని కోసం ఆయన ఎవరితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అందులో తను ఎవరిని కోల్పోయాడు? అనేది తెలియాల్సి ఉంది.
త్రివిక్రమ్ ప్రయోగం వర్కౌట్ అవుతుందా?
త్రివిక్రమ్ సైతం ఇప్పటివరకు చేయనటువంటి ఒక ఎక్స్పరమెంట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది. ఇందులో డార్క్ కామెడీతో పాటు హై లెవెల్ వైలెన్స్ ను త్రివిక్రమ్ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. త్రివిక్రమ్ అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ గా మారుతుందా? గుంటూరు కారం తో ప్లాప్ ను మూటగట్టుకున్న త్రివిక్రమ్ మరోసారి సక్సెస్ బాట పట్టి ప్రేక్షకులందరిని మెప్పించగలుగుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే... త్రివిక్రమ్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. 'ఆదర్శ కుటుంబం ' మూవీ తో సక్సెస్ ను సాధించి ఈ అక్టోబర్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తాడా లేదా చూడాలి...