మహేష్ బాబు చేసిన అల్లరి పని వల్ల...!
మహేష్ బాబు మనం చూడ్డానికి హుందాగా, గంభీర్యంగా కనిపిస్తాడు కానీ సినిమా సెట్లో తోటి నటీనటులతో చాలా జోవియల్‌గా ఉంటాడని చాలా మంది అంటూ ఉంటారు.
మహేష్ బాబు మనం చూడ్డానికి హుందాగా, గంభీర్యంగా కనిపిస్తాడు కానీ సినిమా సెట్లో తోటి నటీనటులతో చాలా జోవియల్‌గా ఉంటాడని చాలా మంది అంటూ ఉంటారు. ముఖ్యంగా ఆయన తనతోటి నటీనటులపై ఎక్కువగా పంచ్‌లు వేస్తూ, ఏదో ఒక విధంగా నవ్విస్తూ ఉంటాడట. మహేష్ బాబుతో వర్క్ చేసిన చాలా మంది ఈ విషయాలను చెప్పారు. ఆయన్ను బయట, మీడియాలో చూసిన విధంగా షూటింగ్ సెట్లో ఉండరని, చాలా యాక్టివ్‌గా షూటింగ్ స్పాట్లో ప్రవర్తిస్తారని హీరోయిన్స్ సైతం అంటారు. అమ్మాయిలతో మహేష్ బాబు అసలు మాట్లాడుతాడా అనే అనుమానం కలుగుతుంది. కానీ హీరోయిన్స్ తో జోకులు వేస్తూ, వారితో జోవియల్‌గా ఉంటాడట. అలా జోవియల్‌గా ఉండి, పంచ్‌లు వేయడం వల్లే వంశీ సినిమా షూటింగ్ సమయంలో నమ్రత గారు మహేష్ బాబు ప్రేమలో పడిందని కొందరు సరదాగా మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం.
మహేష్ బాబు ఒక్కడు షూటింగ్ సమయంలో...
తాజాగా మహేష్ బాబు ఎంత అల్లరివాడు అనే విషయాన్ని చెప్పే ఉదాహరణను ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు, ఎంఎస్ రాజు కాంబోలో మంచి సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా వీరి కాంబోలో వచ్చిన ఒక్కడు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం ఒక ఫోన్ నెంబర్ చెబుతాడు. ఆ ఫోన్ నెంబర్ గురించి అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ ఫోన్ నెంబర్ చాలా ఫేమక్ అయింది. మొబైల్ ఫోన్స్ అప్పుడే వస్తూ ఉండటంతో ఎక్కువ కాల్స్ వస్తాయని ఊహించలేదేమో, అందుకే మహేష్ బాబు సరదాగా నిర్మాత ఎంఎస్ రాజు నెంబర్‌ను పెట్టించాడు. గుణశేఖర్ వద్దు అంటున్నా పర్వాలేదు నేను చూసుకుంటాను అంటూ తన నెంబర్ పెట్టించాడని నిర్మాత ఎంఎస్ రాజు చెప్పుకొచ్చాడు. షూటింగ్ స్పాట్ లో నేను ఆ సమయంలో లేను అని, వచ్చేప్పటికీ ఆ సీన్ షూట్ చేశారని ఎంఎస్ రాజు అన్నారు.
నిర్మాత ఎంఎస్ రాజు ఫోన్ నెంబర్...
మహేష్ బాబు చేసిన ఆ అల్లరి పని వల్ల సినిమా విడుదలైనప్పటి నుంచి రోజుకు వేల ఫోన్ కాల్స్ వస్తూ ఉండేవి. ఆ నెంబర్ నాకు ఎంతో ఇష్టం అయిన నెంబర్, కానీ ఎక్కువ కాల్స్ వస్తుండటంతో తీసి వేయక తప్పలేదు. అప్పట్లో సినిమా వంద రోజులు, రెండు వందల రోజులు ఆడటంతో సినిమా ఆడుతున్నన్ని రోజులు ఫోన్ కాల్స్ వస్తూనే ఉండేవి. అందుకే నెంబర్ మార్చినట్లుగా చెప్పాడు. చాలా మంది ఫోన్ చేసి ఇది ఎవరి నెంబర్ అని అడిగేవారు, కొందరు నా వాయిస్ గుర్తు పట్టి రాజు గారు అనే వారు, కొందరు మహేష్ బాబును కలవాలి అనేవారు.. ఇలా ఫోన్ చేసిన ప్రతి ఒక్కరూ సినిమా గురించి మాట్లాడేవారని ఎంఎస్ రాజు గుర్తు చేసుకున్నాడు. తన కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు రెండు ఫోన్ నెంబర్స్ మాత్రమే మార్చాను అని, అయితే ఒకటి మహేష్ బాబు అల్లరి పని వల్ల మార్చాల్సి వచ్చిందని నిర్మాత ఎంఎస్ రాజు చెప్పుకొచ్చాడు.
రాజమౌళి, మహేష్ బాబు వారణాసి మూవీ....
ఇక మహేష్ బాబు ప్రస్తుత సినిమా విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో వారణాసి చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది చివరి వరకు రాజమౌళి షూటింగ్ పూర్తి చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబోలో కీలక సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురి డేట్లు ఎప్పుడు కలుస్తాయా అని ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఆ టైమ్ వస్తుందని మేకర్స్ అంటున్నారు. రాజమౌళి మూవీ అనగానే పాన్ ఇండియా రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. అయితే మహేష్ బాబు వారణాసి సినిమా పై మాత్రం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేయడంతో పాటు, రెండు మూడు ఆస్కార్ అవార్డ్‌లను ఆశిస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా ఆఫ్ ది రికార్డ్ సమాచారం అందుతోంది. రాజమౌళి ఈ సినిమాను వచ్చే ఏడాదిలో సమ్మర్ కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది ఎంత వరకు వర్కౌట్ అయ్యేనో చూడాలి.