రైతుల నిరసనకు మద్దతు తెలిపిన పాప్ సింగర్ పై ఫైర్ అయిన స్టార్ హీరోయిన్..!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ డైలీ ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తనకు సంబంధించిన విషయాలు.. సంబంధంలేని విషయాల గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తుంది. ఇక ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై రైతుల నిరసనలపై ఎప్పటికప్పుడు ట్వీట్స్ పెడుతూ వస్తోంది. బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ రైతుల నిరసనకు సపోర్ట్ చేసే ప్రముఖులపై ట్విట్టర్ లో ఫైర్ అవుతూ వస్తోంది. ఇటీవల బాలీవుడ్ హీరో దిల్ జిత్ దోసాన్హాతో మాటల యుద్ధానికి దిగింది. ఈ క్రమంలో తాజాగా రైతుల నిరసనపై స్పందించిన ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ రిహన్న ను ఉద్దేశిస్తూ ‘సిట్ డౌన్ యు ఫూల్’ అని ట్వీట్ చేసింది కంగనా.
వివరాల్లోకి వెళ్తే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనకు అంతర్జాతీయ పాప్ స్టార్ రిహన్న తన మద్దతు తెలిపారు. రైతుల నిరసన గురించి ఓ వార్తా కథనాన్ని ట్వీట్ చేస్తూ “మనం దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు?, #FarmersProtest” అని పేర్కొంది. దీనికి రైతు ఉద్యమాన్ని అణచివేతకు ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు సైతం నిలిపివేశారనే కథనాన్ని జత చేసింది. రిహన్న ట్వీట్ పై పలువురు ప్రముఖులు ప్రశంసించారు. అయితే దీనిపై కంగనా మాత్రం ప్రతికూలంగా స్పందించింది. “ఎవరూ దీని గురించి మాట్లాడటం లేదు ఎందుకంటే వారు రైతులు కాదు.. ఎందుకంటే వారు భారతదేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు.. తద్వారా బలహీనమైన ముక్కలైన దేశాన్ని చైనా స్వాధీనం చేసుకుని యుఎస్ఎ లాగా చైనా కాలనీగా మార్చగలది. సిట్ డౌన్ యు ఫూల్, మేము మీ డమ్మీస్ లాగా మా దేశాన్ని అమ్మడం లేదు” అని కంగనా ట్వీట్ చేసింది.