• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మళ్లీ కెలకడం ఎందుకు...

మళ్లీ కెలకడం ఎందుకు అమ్మడు?

By - Tupaki Desk
Update: 2020-01-21 06:06 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన కంగనా రనౌత్‌ పలువురి తో వివాదం పెట్టుకుంది. ఆమె వ్యవహార శైలి నచ్చక చాలా మంది దర్శక నిర్మాతలతో ఈమెకు గొడవ వచ్చింది. ఇక పలువురు స్టార్‌ హీరోలు మరియు హీరోయిన్స్‌ ను కూడా ఈమె నోటికి వచ్చినట్లు గా గతంలో విమర్శించిన విషయం తెల్సిందే. ఎప్పుడు ఏదో ఒక వివాదంపై మాట్లాడుతూనే ఉండటం.. లేదంటే కొత్త వివాదంను క్రియేట్‌ చేసేలా మాట్లాడటం చేస్తూనే ఉంటుంది. ముక్కు సూటిగా ఉండటం తో పాటు తాను అనుకున్నది చెప్పడం ఈమె నైజం.

గతంలో తెలుగు దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో మణికర్ణిక మొదలు పెట్టింది. జాన్సీ లక్ష్మీభాయి జీవిత చరిత్ర ఆధారంగా మణికర్ణిక ను తీసేందుకు సిద్దమయిన క్రిష్‌ కు పదే పదే కంగనా నుండి సలహాలు స్క్రిప్ట్‌ లో సూచనలు వచ్చాయి. జాన్సీ జీవితంలో జరగని సంఘటనలు కూడా కొన్ని మార్చాలని కంగనా సూచించింది. సినిమాలో ఆమె ఇన్వాల్వ్‌ మెంట్‌ ఎక్కువ అవ్వడంతో చిర్రెత్తుకు వచ్చిన క్రిష్‌ ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. అప్పట్లో ఆ వివాదం చాలా పెద్దగా అయ్యింది. సినిమా విడుదలై కొన్నాళ్ల తర్వాత ఆవిషయంను అంతా మర్చి పోయారు. కాని ఇప్పుడు మళ్లీ కంగనా ఆ విషయాన్ని కెలకడం మొదలు పెట్టింది.

క్రిష్‌ గతంలో మద్యలో వదిలేసిన సినిమాను నేను పూర్తి చేశాను. సినిమాను బతికించడంతో పాటు నిర్మాతలను కాపాడాను అంటూ ఒక ఇంటర్వ్యూలో తాజాగా కంగనా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. సినిమాను మద్యలో వదిలేయడం వల్ల నేను టేకోవర్‌ చేశాను.. నన్ను అభినందించాల్సింది పోయి చాలా మంది నన్ను విమర్శించారంటూ కంగనా చెప్పుకొచ్చింది. ఇండియన్‌ సినిమాలో దర్శకుడి గా ఉండటం కంటే నటుడిగా ఉండటం గౌరవం. కాని నేను దర్శకురాలిగా మారి మణికర్ణిక చిత్రాన్ని పూర్తి చేశానంటూ తనను తాను గొప్పగా చెప్పుకుంది.

కంగనా వ్యాఖ్యలపై గతంలోనే క్రిష్‌ స్పందించాడు. ఆమె జాన్సీ లక్ష్మీభాయి చరిత్రను వక్రీకరించాలని కోరింది. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆమె బలవంతం చేయడంతో నేను తప్పుకున్నాను అంది. ఇక సోనూ సూద్‌ కు ఆమె స్క్రిప్ట్‌ లో పదే పదే మార్పులు చేర్పులు చెప్పడంతో నచ్చక తప్పుకున్నాడు అంటూ క్రిష్‌ పేర్కొన్నాడు. కంగనా ఉన్నది ఉన్నట్లుగా చూపించకుండా మార్చి చూపించిందని.. అది నాకు నచ్చక తప్పుకున్నట్లుగా క్రిష్‌ క్లారిటీ ఇచ్చాడు. కాని ఇప్పుడు మళ్లీ కంగనా ఆ విషయాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.


Tags:    
  • Kangana Ranaut Fires on Director Krish 
  • Kangana Ranaut 
  • Bollywood 
  • Bollywood Actress 
  • Bollywood Latest Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

Copyright @2026

Powered by Blink CMS