సినిమా ఏ ఒక్కరిదీ కాదు : కమల్

Update: 2015-05-25 19:30 GMT
సినిమా అనేది అనేక కళల సమాహారం. ఇది ఏ ఒక్కరి సొంతమూ కాదు. లైట్ బాయ్ మొదలుకొని కళా దర్శకుడు, మేకప్ మేన్, డాన్సు మాస్టర్, ఎడిటర్, రచయితలు, దర్శకులు, నటీనటులు, నిర్మాత ఇలా 24 విభాగాల వారందరి కష్టానికి తుది రూపమే సినిమా. కాని కొన్ని సినిమాల్లో మాత్రం కేవలం కెమెరా బాగుందనో, ఆర్ట్ వర్క్ బాగుందనో, లేదా సంగీతం బాగుందనో ఆ సినిమాని ఏదో ఒక విభాగానికే పరిమితం చేస్తుంటారు. సినిమా కష్టం గురించి కమల్ కి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన డాన్సు అసిస్టెంట్ గా తన ప్రస్థానం ప్రారంభించి అనేక విభాగాల్లో చేస్తూ వస్తున్నారు. 

ఇదే విషయాన్ని కమల్ చెబుతూ ఒక సినిమాలో ఏ అంశం ప్రేక్షకులకు బాగా నచ్చితే ఆ పనిచేసేవారికే ఆ సినిమా అంకితమవుతుందని, షోలే సినిమా చూసిన వారందరికీ గబ్బర్ సింగ్ పాత్ర తప్ప మిగతా సినిమా పట్టదని నిన్న జరిగిన చీకటి రాజ్యం ఫస్ట్ లుక్ కార్యక్రమంలో చెప్పారు. కాని ఈ సినిమాకి మాత్రం మంచి టీమ్ దొరికిందని, నిర్మాతగా పెట్టుబడి పెట్టినంత మాత్రాన ఈ సినిమా తనది మాత్రమే కాదని చెప్పారు. తెలుగులో నాకంటే ప్రకాష్ రాజ్, తిషలే సీనియర్లు అని వారిపై ఛలోక్తి విసిరారు. దీంతో వారిద్దరితోపాటు సభికులూ నవ్వా
పుకోలేకపోయారు.       
Tags:    

Similar News