కమల్‌ కెలికేసినట్లున్నాడే..

Update: 2015-06-30 07:52 GMT
'పాపనాశం' విజువల్స్‌ చూస్తే ఏమో.. మలయాళ 'దృశ్యం'ను, తెలుగు 'దృశ్యం'ను యాజిటీజ్‌గా దించేసినట్లే ఉంది. ఏం తేడా ఉన్నట్లు తెలియట్లేదు. కానీ ఉన్నదున్నట్లు తీసేస్తే ఇక కమల్‌ హాసన్‌ ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి. అందుకే తన ముద్ర చూపించడానికి ఏదో చేసినట్లే ఉన్నాడు. అందుకే 'దృశ్యం' మలయాళ వెర్షన్‌ కంటే 'పాపనాశం' ఇంకో 20 నిమిషాల నిడివి పెరిగిపోయింది. మలయాళ వెర్షన్‌ 2 గంటల 40 నిమిషాలు కాగా.. 'పాపనాశం' మూడు గంటల నిడివి దాటిపోవడం విశేషం. తెలుగు వెర్షన్‌ మలయాళం కంటే ఇంకో 20 నిమిషాలు తక్కువే ఉంటుంది.

సాగతీత అనుకున్న కొన్ని సన్నివేశాల్ని తీసేసి.. 2 గంటల 25 నిమిషాల నిడివితో తెలుగు 'దృశ్యం'ను క్రిస్ప్‌గా తయారు చేసింది దర్శకురాలు శ్రీదివ్య. ఆ ప్రయత్నం తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. మామూలుగానే థ్రిల్లర్‌ మూవీస్‌ నిడివి తక్కువుంటాయి. 'దృశ్యం'లో పాటలకు పెద్దగా ప్రాధాన్యం కూడా లేవు. మరి ఏకంగా 3 గంటలకు నిడివి పెంచేయడమంటే టూమచ్‌ అనే చెప్పాలి. ఒరిజినల్‌ కంటే నిడివి తగ్గించడం చూస్తాం కానీ.. ఇలా పెంచేయడం మాత్రం కమల్‌కు మాత్రమే చెల్లింది. మోహన్‌లాల్‌, వెంకటేష్‌ల కంటే కమల్‌ గొప్ప నటుడు కదా. తన నట వైవిధ్యాన్ని చూపించడానికే ఈ ఎక్స్‌ట్రా 20 మినిట్స్‌ అనుకోవాలి. ఈ శుక్రవారం 'పాపనాశం' ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి 3 గంటల సినిమాను తమిళ ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News