మావన్నీ సర్కస్ ఫీట్లే : కమల్

Update: 2015-06-30 10:45 GMT
సినిమాల్లోని కొన్ని సన్నివేశాల ప్రభావం నిజ జీవితంలోనూ అవగాహన లేని కొంతమందిపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. సిగరెట్ వెలిగించడం.. గుప్పుమని పొగలు వదలడం.. కళ్ళద్దాలు గిరాగిరా తిప్పి పెట్టుకోవడం.. దగరనుండి దుస్తులు.. బాడీ లాంగ్వేజ్ అన్నిటినీ కాపీ కొడుతూ మేమూ హీరోలమే అంటూ పోజులు కొడుతుంటారు. చివరికి ఫిట్నెస్ కి సూచనగా చెప్పుకునే సిక్స్ ప్యాక్ కి ఈ లెవెల్ లో ఆదరణ లభించించిందంటే అది సినిమా హీరోల చలవే. అయితే ఇలాంటివన్నీ నిజ జీవితంలో సాధ్యం కావని చెబుతున్నారు కమల్ హాసన్.

సినిమాల్లో మేం చేసేవన్నీ సర్కస్ ఫీట్లే. అందులోనూ మా చుట్టూ వందలాది మంది సహాయకులు వుంటారు. మాకు తర్ఫీదునిచ్చె శిక్షకులూ వుంటారు. అందుకని మేం ఏం చేసినా వాటిని మీరూ చేయాలనుకొని జీవితాన్ని విచ్చిన్నం చేసుకోవద్దు అని చెబుతున్నారు. అసలీ చర్చ అంతా ఎందుకొచ్చిందంటే.. కమల్ నటించిన పాపనాశం సినిమాలో టివిఎస్ పై హెల్మెట్ లేకుండా నలుగురితో ప్రయాణం చేస్తున్న సన్నివేశాలు వున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ లోనూ ఆ స్టిల్ వుంది. దాని గురించి తన వంతు సామాజిక బాధ్యతగా ఇలా వివరణ ఇచ్చారు లోకనాయకుడు. జూలై 3న పాపనాశం విడుదల కానుంది.         
Tags:    

Similar News