ఏపీ సీఎం జగన్ కు థ్యాంక్యూ చెప్పిన కమల్ హాసన్

Update: 2020-09-29 06:45 GMT
గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచిపోయారు. కానీ ఆయన పాటల పరిమళం ఇంకా మన చెవులకు వినిపిస్తూనే ఉంది. దేశం గర్వించే ఆ పాటల జ్ఞాని పుట్టింది మన ఏపీలోని నెల్లూరు జిల్లాలోనే. అందుకే ఎస్పీ బాలుకు ‘భారతరత్న’ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం మోడీకి లేఖ రాశారు.

తాజాగా సీఎం జగన్ చేసిన అభ్యర్థనపై విలక్షన నటుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. బాలుకి భారతరత్న ఇవ్వాలని కోరినందుకు ఏపీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

‘మన సోదరుడు ఎస్పీ బాలు కోసం మీరు చేసిన వినతి గౌరవమైనది.. సరైనది.. దీనిపై తమిళనాడులోనే కాదు.. దేశమంతా ఉన్న బాబు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు’ అంటూ కమల్ హాసన్ ట్విట్టర్ లో జగన్ కు థ్యాంక్స్ చెప్పారు.

కరోనా బారినపడ్డ బాలు చికిత్స పొందుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం చనిపోయారు. 50 రోజులుగా ఆయన మృత్యువుతో పోరాడి అసువులు బాసిన సంగతి తెలిసిందే. 4 దశాబ్ధాలుగా 16 భాషల్లో 40వేలకు పైగా బాలు పాటలు పాడారు. దీంతో ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది.
Tags:    

Similar News