• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ నటి పెళ్లిని దగ్గరుండి...

ఆ నటి పెళ్లిని దగ్గరుండి చేసిన విశ్వకథానాయుడు

By - Tupaki Desk
Update: 2021-07-31 03:43 GMT
సినీ పరిశ్రమకు చెందిన పెళ్లిళ్లకు సినీ ప్రముఖులు చాలా తక్కువే హాజరవుతారు. కొద్ది మందిని మినహాయిస్తే.. మిగిలిన వారంతా ఎక్కువగా హాజరయ్యేంది తక్కువ. హీరోయిన్ల పెళ్లిళ్లు దాదాపుగా లవ్ మ్యారేజ్ కావటమే కానీ సంప్రదాయబద్ధంగా పెళ్లిళ్లు జరిగేది తక్కువ. ఇక.. హీరోల విషయానికి వస్తే.. వారి పెళ్లిళ్ల హడావుడి ఒక రేంజ్ లో జరిగినా.. దానికి హాజరయ్యే హీరోయిన్ల శాతం తక్కువగానే ఉంటారు. చాలా కొద్దిమంది కథానాయకుల పెళ్లిళ్లలోనే హీరోయిన్లు తళుక్కుమంటారు.

రీల్ లైఫ్ లో సక్సెస్ ఫుల్ జంటగా పేరుండే హీరోహీరోయిన్లలో ఎవరికైనా పెళ్లిళ్లు జరుగుతుంటే.. వారు వెళ్లి నూతన వధూవరుల్ని ఆశీర్వదించటం చాలా చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సూటి సమాధానం చెప్పరు. కానీ.. ఇలాంటి రోటీన్ సీన్లకు భిన్నమైన సీన్ చోటు చేసుకుంది. కాకుంటే.. అది చెన్నైలో. తాజాగా ఒక సినీ జంట ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లికి విశ్వ కథానాయకుడు కమల్ హాసన్ హాజరు కావటమే కాదు.. దగ్గరుండి పెళ్లి చేయించిన వైనం ఆసక్తికరంగా మారింది. అయితే.. సదరు సినీ జంట కమల్ కు చెందిన మక్కల్ నీది మయ్యం యువజన విభాగ కార్యదర్శిగా పని చేస్తుండటం గమనార్హం. గేయ రచయితగా పేరున్న స్నేహాన్.. కొన్నేళ్లుగా నటి కన్నికను ప్రేమిస్తున్నారు.

వారిద్దరి మధ్య ప్రేమాయణం అందరికి తెలిసిందే. తాజాగా వారిద్దరు పెళ్లి చేసుకోవటానికి డిసైడ్ అయ్యారు. ఈ పెళ్లికి మక్కల్ నీది మయ్యం అధినేతగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్.. సినీ దర్శక దిగ్గజం భారతీరాజాలాంటి ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి చెన్నైలోని ఒక  స్టార్ హోటల్ లో జరిగింది. కరోనా మార్గదర్శకాల్ని కచ్ఛితంగా అమలు చేస్తూ నిర్వహించిన ఈ పెళ్లి వేళ.. కమల్ హాసన్ స్వయంగా మంగళసూత్రాన్ని తీసి వరుడి చేతికి ఇవ్వగా.. ఆయన దాన్ని తీసుకొని వధువు మెడలో కట్టటం చూపురలను ఆకట్టుకుంది. ఈ పెళ్లికి రెండు వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు.. కొద్ది మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. కమల్ హాసన్ స్వయంగా హాజరై.. దగ్గరుండి పెళ్లి చేసిన వైనం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.చూస్తుంటే.. ఇది సినిమా బంధం కంటే రాజకీయ బంధంగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.
Tags:    
  • Snehan Marriage 
  • Actor Kannika Ravi 
  • Actor Kannika Ravi wedding 
  • kamal hasan 
  • kamal hasan movies 
  • kamal hasan new movie 
  • kamal hasan vikram 
  • indian 2 

Similar News

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

Copyright @2026

Powered by Blink CMS