పూరి జగన్‌ పై కేసు తప్పదా??

Update: 2016-06-01 08:16 GMT
దర్శకుడు పూరి జగన్‌ పై ఇప్పుడు కేసులు వర్షం కురిసేలా ఉంది. ఎవరు పెట్టినా పెట్టకపోయినా.. నేను మాత్రం కోర్టులో క్రిమినల్‌ పరువు నష్టం దావా వేస్తాను అంటున్నాడు పంపిణీదారుడు కాళీ సుధీర్‌. ఈ మధ్య కాలంలో పూరి సృష్టించిన సంచలనాల తాలూకు ఆఫ్టర్‌ ఎఫెక్ట్ క్రింది దీనిని పరిగణించవచ్చు. పదండి అసలు మ్యాటర్‌ ఏంటో చూద్దాం.

లోఫర్‌ సినిమాలో లాసులు వచ్చినందుకు.. ముగ్గురు పంపిణీదారులు.. కాళీ సుధీర్‌, అభిషేక్‌ నామా, ముత్యాల రామదాస్‌.. తనను మానసికంగా టార్చర్‌ చేస్తున్నారని.. ఆఫీసుకు వచ్చి తనపై చేయి చేసుకున్నారని.. అలాగే సినిమాలు తీయమని బెదిరిస్తున్నారని.. దర్శకుడు పూరి జగన్‌ కంప్లయింట్‌ ఇచ్చాడు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌ లో తన స్నేహితుడు ఏ.సి.పి.గా పనిచేస్తుండటంతో.. ఈజీగా పూరి అక్కడ కేసు ఫైల్‌ చేసేశాడనేది ఫిలిం నగర్‌ టాక్‌. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని.. లోఫర్‌ సినిమాకు చాలా డబ్బులు ఇచ్చిన మాట నిజమేనని.. పైగా పూరి ఆఫీస్‌ లోనే సిసిటివి కెమెరాలు ఉంటాయని.. వాటిలోని ఫుటేజ్‌ చూస్తే నిజం ఏంటనేది తెలుస్తుందని పంపిణీదారులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.

కట్‌ చేస్తే.. పూరి ఈ కేసును ఉపసంహరించుకున్నాడు. అయితే డిస్ర్టిబ్యూటర్‌ కాళీ సుధీర్ మాత్రం.. తన క్యారెక్టర్‌ ను పాడుచేసే ప్రయత్నం చేసిన పూరి జగన్‌ ను వదిలే ప్రసక్తే లేదని.. ఒకవేళ ఇతరులు తనతో కలవకపోయినా కూడా.. తానే ఇండివిడ్యువల్‌ గా పూరిపై కోర్టులో కేసు నడుపుతానని.. ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్‌ తీసుకుని తీరుతానని అంటున్నాడు కాళీ సుధీర్.
Tags:    

Similar News