కాజల్ పెళ్లి హడావుడి ముచ్చట్లు ఏమీ ఉండవు
సాదారణంగా ఒక సెలబ్రెటీ పెళ్లి అంటే హడావుడి మామూలుగా ఉండదు. అదే ఒక స్టార్ హీరోయిన్ పెళ్లి అయితే ఎలాంటి హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని కరోనా కారణంగా ఎంతో మంది ప్రముఖులు చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిల్లు నలుగురు మద్య జరిగాయి. త్వరలో జరుగబోతున్న కాజల్ అగర్వాల్ పెళ్లి కూడా అలాగే 20 మంది గెస్ట్ ల మద్య సింపుల్ గా జరగబోతుందట. పెళ్లి కోసం పంక్షన్ హాల్ ఇతర ఏర్పాట్లు కూడా ఏమీ లేవని ఇంట్లోనే కాజల్ గౌతమ్ లు ఒక్కటి కాబోతున్నట్లుగా కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
రెండు మూడు నెలల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. పెళ్లిలు జరుపుకునేందుకు అనుమతులు వస్తున్నాయి. వందల సంఖ్యలో పెళ్లిలకు హాజరు అయినా కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినా కూడా కరోనా కారణంగా కాజల్ అగర్వాల్ ఎవరిని రిస్క్ లో పెట్టకూడదు అనే ఉద్దేశ్యంతో పెళ్లిని సింపుల్ గా హడావుడి లేకుండానే చేసుకోవాలని కాజల్ నిర్ణయానికి వచ్చిందట. కాజల్ సింపుల్ మ్యారేజ్ కు రెడీ అయిన కారణంగా ఆమె పెళ్లి ముచ్చట్లు పెద్దగా ఏమీ ఉండే అవకాశం లేదు.
అభిమానులు ఆమె పెళ్లి ముచ్చట్లు సంగీత్ వీడియోల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారంతా కూడా నిరుత్సాహంకు గురి అవ్వాల్సిందేనేమో అంటున్నారు. ఈనెల 30న కాజల్ వివాహం జరుగబోతున్న విషయం తెల్సిందే. ప్రియుడు గౌతమ్ తో కాజల్ ఒక్కటి కాబోతుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది.