ప్రియాంక చోప్రా పాత్రను చేయబోతున్న కాజల్‌

Update: 2020-07-24 08:49 GMT
ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకుంది. హాలీవుడ్‌ సినిమాల్లో కూడా పీసీ నటించే స్థాయికి వెళ్లడానికి ప్రధాన కారణం ఆమె నటించిన ‘క్వాంటికో’ వెబ్‌ సిరీస్‌. ఆ వెబ్‌ సిరీస్‌ తో ప్రియాంక చోప్రాకు అంతర్జాతీయ స్థాయిలో స్టార్‌ డం దక్కింది. ఇప్పుడు ఆ వెబ్‌ సిరీస్‌ ను ఇండియన్‌ లాంగ్వేజ్‌ ల్లో తీసుకు వచ్చేందుకు నెట్‌ ఫ్లిక్స్‌ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రియాంక చోప్రా పాత్రకు గాను కాజల్‌ అగర్వాల్‌ ను సంప్రదించారట. క్వాంటికో లో ప్రియంక చోప్రా చాలా బోల్డ్‌ గా నటించింది. మరి ఆ స్థాయిలో కాజల్‌ నటించేనా చూడాలి.

బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా మంచి గుర్తింపు ఉండటం వల్ల కాజల్‌ ను క్వాంటికో వెబ్‌ సిరీస్‌ కోసం సంప్రదించారట. త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. హిందీలో రూపొందించి తెలుగు తమిళం కన్నడం మలయాళం ఇంకా ఇతర ఇండియన్‌ భాషల్లో కూడా డబ్‌ చేసే ఆలోచనల్లో నెట్‌ ఫ్లిక్స్‌ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే కాజల్‌ ఒక వెబ్‌ సిరీస్‌ లో నటిస్తూ ఉంది. ఈ సమయంలోనే క్వాంటికో వెబ్‌ సిరీస్‌ ఆమెకు మరో బంపర్‌ ఆఫర్‌ గా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం హీరోయిన్‌ గా కాజల్‌ తమిళంలో ‘ఇండియన్‌ 2’ మరియు తెలుగులో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలు కూడా కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు ప్రారంభం అయ్యే విషయంలో క్లారిటీ లేదు. కనుక వెబ్‌ సిరీస్‌ లను కాజల్‌ కమిట్‌ అవుతుంది. హీరోయిన్‌ గా క్రేజ్‌ తగ్గిన ఈ సమయంలో వరుసగా వెబ్‌ సిరీస్‌ ల్లో ఛాన్స్‌ రావడంతో కాజల్‌ మళ్లీ బిజీ అవ్వనుంది. కరోనా పరిస్థితులు కాస్త అయినా కుదట పడ్డ తర్వాత వెంటనే కాజల్‌ షూట్‌ కు రెడీ అయ్యే అవకాశముంది.
Tags:    

Similar News