ఆ సినిమా నుంచి కాజల్ ఔట్

Update: 2016-07-29 01:30 GMT
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఎదుర్కొన్న కాజల్ అగర్వాల్‌‌ కు తెలుగులో ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. తనకు తెలుగులో తొలి అవకాశం ఇచ్చిన తేజ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కబోయే సినిమాకు మాత్రమే సంతకం చేసింది చందమామ. చిరు సరసన 150వ సినిమాలో హీరోయిన్ అని ప్రచారం జరిగింది కానీ.. అదంతా ఉత్తమాటే అని ఆ చిత్ర యూనిట్ వర్గాలు స్పష్టం చేశాయి. ఐతే తెలుగులో పరిస్థితి ఎలా ఉన్నా.. తమిళంలో మాత్రం కాజల్‌ కు అవకాశాలు బాగానే ఉన్నాయి. విక్రమ్.. అజిత్ లాంటి స్టార్ హీరోల సరసన ఆమెకు అవకాశాలు దక్కాయి. ఐతే ఇందులో ఒక అవకాశం ఆమె చేజారింది.

విక్రమ్ సరసన చేయాల్సిన ‘గరుడ’ సినిమా నుంచి కాజల్ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకుంది. ఈ సినిమాకు ఐదు నెలల కిందటే సంతకం చేసింది కాజల్. అప్పటికి అజిత్ సినిమా అవకాశం రాలేదు. ‘గరుడ’ రెండు నెలల కిందటే సెట్స్ మీదికి వెళ్లాల్సింది. కానీ ‘ఇరుముగన్’ ఆలస్యం కావడం..ఇంకొన్ని కారణాల వల్ల ‘గరుడ’ అనుకున్న సమయానికి మొదలవ్వలేదు. ఈలోపు కాజల్.. అజిత్ సినిమా కోసం పని చేయాల్సిన టైం వచ్చేసింది. విక్రమ్ సినిమా కోసం ఇప్పటికే స్పష్టత లేకపోవడంతో కాజల్ ఆ సినిమా నుంచి తప్పుకుంది. విక్రమ్ సినిమా ఇంకొన్ని రోజుల్లోనే మొదలైనా.. అజిత్ సినిమాకు కేటాయించిన డేట్లను దీనికి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే అజిత్-శౌర్య శివ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఆ సినిమాకే ఓటేసింది కాజల్.
Tags:    

Similar News