కాజల్ ఎవర్ని కలిసింది మాష్టారూ?

Update: 2016-07-23 11:30 GMT
ఇప్పుడు మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యి కూర్చున్న విషయం ఏంటంటే.. ''కాజల్‌ శుక్రవారం సెట్స్ లో మెగాస్టార్‌ చిరంజీవిని కలసి.. 150వ సినిమా చేయడానికి అంగీకారం తెలిపింది'' అంటూ ఒక టాప్ న్యూస్ పేపర్ ప్రచురించిన విషయం గురించే. అసలు ఈ సినిమా కోసం కాజల్ ను ఎప్రోచ్ కాలేదు అంటూ న్యూసులు వస్తున్న తరుణంలో.. ఈ న్యూస్ ఏంటి బాబోయ్ అనే పంచ్ తగలుతోంది మరి.

అసలు శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్లో లేరు. ఆయన పార్లమెంటులో ఎం.పి. కెవిపి పెట్టిన ఒక ప్రైవేట్ బిల్లుపై ఓటింగ్ కోసం పట్టుపట్టేందుకు.. ఢిల్లీ వెళ్ళారు. సభ సోమవారానికి వాయిదా పడటంతో.. చిరు తదుపరి వారం కూడా అక్కడే ఉండాల్సి వచ్చేలా ఉంది. అలాంటప్పుడు కాజల్‌ ఇంతకీ ఎవర్ని కలసినట్లు? కాకపోతే ఒక నిజం ఏంటంటే.. ఎవరన్నా టాప్‌ హీరో తనకు సినిమాలో ఆఫర్‌ ఇస్తే మాత్రం.. వెంటనే లొకేషన్ కు వెళ్లి వారిని కలవడం కాజల్ కు అలవాటే. గతంలో సర్దార్ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ ఇవ్వగానే లొకేషన్లో పవన్ కళ్యాణ్‌ ను కూడా ఇలాగే కలిసింది అమ్మడు.

ఇంతకీ మెగాస్టార్‌ చిరు తన కొడుకుతో ఓ నాలుగుసార్లు జతకట్టిన హీరోయిన్ తో పనిచేయడానికి రెడీగా ఉన్నారా? గతంలో అక్కినేనితో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి.. ఆ తరువాత నాగార్జునతో చేసినట్లు.. ఇప్పుడు అదే రివర్సులో జరుగుతుందా? ఏమో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News