చందమామ ముఖాన్ని ఎందుకు దాచిపెట్టారో మరి..!

Update: 2021-02-24 16:30 GMT
దక్షిణాది అగ్ర కథానాయికలలో ఒకరైన కాజల్ అగర్వాల్ కెరీర్ స్టార్ట్ దశాబ్దం దాటిపోయినా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది. కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వరుస అవకాశాలు అందుకుంటోంది. అయితే బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకోవాలనే కోరిక మాత్రం నెరవేరలేదనే చెప్పాలి. చిన్న వేషంతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాజల్.. 'సింగం' 'స్పెషల్ 26' 'దో లఫ్జోంకీ కహానీ' వంటి సినిమాలో నటించింది. ఇందులో రెండు సినిమాలు హిట్ అయినా అమ్మడి కెరీర్ కి ఏమాత్రం హెల్ప్ అవలేదు. అయినా సరే అవకాశం వచ్చినప్పుడల్లా హిందీ సినిమాల్లో నటిస్తూనే వస్తోంది. ఈ నేపథ్యంలో 'ముంబై సాగా' అనే క్రైమ్ థ్రిల్లర్ లో కాజల్ నటించింది.

బాలీవుడ్ స్టార్స్ ఇమ్రాన్ హష్మి - జాన్ అబ్రహం - సునీల్ శెట్టి ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ క్రైమ్ డ్రామాలో కాజల్ అగర్వాల్ ది కూడా కీలక పాత్ర అని ప్రచారం జరిగింది. టి-సిరీస్ మరియు వైట్ ఫెదర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ - కిషన్ కుమార్ - అనురాధ గుప్తా - సంగీత అహిర్ నిర్మిస్తున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే టీజర్ చూసిన తర్వాత అమ్మడి ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది.

ఎందుకంటే ఇందులో కనీసం కాజల్ ఫేస్ కూడా చూపించలేదు. ఇతర ప్రధాన పాత్రధారులని చూపించారు కానీ.. హీరోయిన్ కాజల్‌ కు మాత్రం చోటు లేకపోయింది. దీంతో ఈ సినిమాలో కాజల్ పాత్ర నామమాత్రమేనా అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే కావాలనే ఆమె క్యారక్టర్ ని రివీల్ చేయలేదేమో అనేవారు కూడా లేకపోలేదు. మరి ఈ చందమామను 'ముంబై సాగా'లో ఇంపార్టెన్స్ ఇచ్చారా లేదా అనేది త్వరలో రాబోయే ట్రైలర్ తో తెలిసే అవకాశం ఉంది. అయితే కాజల్ మాత్రం సోషల్ మీడియాలో టీజర్ అప్డేట్ ఇస్తూ తన బాలీవుడ్ సినిమాని బాగానే ప్రమోట్ చేస్తోంది.
Tags:    

Similar News