ఫోటో స్టొరీ: ఆ ఎక్స్ ప్రెషన్లు ఏంటి అమ్మడూ!

Update: 2019-09-14 12:34 GMT
టాలీవుడ్ లో చాలామందే హీరోయిన్లు ఉన్నారు కానీ వారిలో కాజల్ అగర్వాల్ రూటే సపరేటు. ఫేడ్ అవుట్ అయిందని ఎప్పటినుంచో జనాలు అంటూనే ఉన్నారు కానీ అలా అన్నవారు ఫేడ్ అవుట్ అయ్యారు కానీ కాజల్ మాత్రం అలానే ఉంది.  ఇప్పటికీ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయంటే కాజల్ టాలెంట్ మనం అర్థం చేసుకోవచ్చు.  ఇక ఫోటో షూట్లు చేయడం.. నెటిజన్లను రొమాంటిక్ రేడియేషన్ కు గురిచేయడం ఈ చందమామకు మొదటి నుంచి అలవాటే.

రీసెంట్ గా మరోసారి ఒక ఫోటో షూట్ లో పాల్గొంది.  బ్రౌన్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ ధరించి హాటు పోజులిచ్చింది. ఒక ఫోటోలో మూతిని అదోరకంగా పెట్టి లిప్ లైనర్ పూసుకుంటోంది.  డ్రెస్ కు సరిగ్గా మ్యాచ్ అయ్యే డిజైన్ ఉన్న ఇయర్ రింగ్స్.. బ్రౌన్ షేడ్ హెయిర్ తో స్టైలిష్ గా ఉంది. అయితే ఎక్స్ ప్రెషన్స్ మాత్రం పెద్దగా అందంగా లేవు.  ఎలా ఉన్నా చందమామ చందమామే కదా.  ఫేస్ లో గ్లో మాత్రం భలే ఉంది.  ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అవుతున్నా అదే రకమైన గ్లామర్ మెయింటెయిన్ చేస్తుందంటే అదేమీ సాధారణ విషయం కాదు. ఆ సీక్రెట్ ఏంటో అందరికీ చెప్తే ఫాలో అవుతారు కదా!

కాజల్ సినిమాల విషయానికి వస్తే తమిళంలో 'ప్యారిస్ ప్యారిస్'.. 'ఇండియన్ 2 '  #సూర్య 39 చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో 'ముంబై సాగా' అనే చిత్రంలో కూడా నటిస్తోంది.  తెలుగులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అ 2' లో కూడా కాజల్ నటిస్తుందని అంటున్నారు.  అంటే ఇప్పుడు కూడా మూడు వుడ్లను కవర్ చేస్తోంది చందమామ!


Tags:    

Similar News