జూలియెట్.. లవర్ ఆఫ్ ఈడియట్

Update: 2017-06-27 06:07 GMT
అందాల రాక్షసి మూవీలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువనటుడు నవీన్ చంద్ర. ఇక జెంటిల్ మ్యాన్ మూవీతో తెలుగు ఇంట్రీ ఇచ్చిన భామ నివేదా థామస్. వీరిద్దరు జంటగా నటిస్తున్న మూవీ 'జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్'. పేరు మాత్రమే కాదు సినిమా కూడా డిఫరెంట్ గా ఉంటందన్నది మేకర్స్ చెబుతున్న మాట.

ఆర్య నుంచి 100 పర్సెంట్ లవ్ వరకూ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అజయ్ వోధిరాల.. జూలియెట్ లవర్ ఆఫ్ ఈడియట్ మూవీతో దర్శకుడిగా పరియం అవుతున్నాడు. సుకుమార్ దగ్గర పని చేసిన మహత్యమేమో కానీ.. ఈ సినిమా స్టోరీ అంతా ఓ లాజిక్ ప్రకారం నడుస్తుందని చెబుతున్నాడు దర్శకుడు అజయ్. హీరో హీరోయిన్స్ యాక్టింగ్ తో పాటు.. అసలీ సినిమాలో జూలియట్ ఎవరు.. ఆమెని ప్రేమించిందెవరు అనే కాన్సెప్ట్ ఆకట్టుకుటుందని చెప్పిన దర్శకుడు అజయ్.. తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ తో ఆశ్చర్యానికి గురి చేశాడు.

భక్తప్రహ్లాద- హెచ్ ఎం రెడ్డి.. వందేమాతరం- బీఎన్ రెడ్డి.. ఇలా ఆయా దిగ్గజ దర్శకుల తొలి చిత్రాల పోస్టర్లను వరుసగా చూపిస్తూ.. చివరలో తాత మనవడు-దాసరి.. రాజమౌళి-స్టూడెంట్ నెంబర్1.. ఆర్య-సుకుమార్ అంటూ చూపించిన తర్వాత.. చివరకు తన సినిమా అయిన జూలియట్.. లవర్ ఆఫ్ ఈడియట్ పోస్టర్ చూపించిన విధానం బాగుంది కానీ.. మరీ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉందేమో అనిపించక మానదు. మరి అలాంటి డైరెక్టర్ల స్థాయికి తాను కూడా చేరుకోవాలన్నది అజయ్ వోధిరాల టార్గెట్ కావచ్చేమో.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News