• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆర్ఆర్ఆర్'లో ఆ హీరోకి...

'ఆర్ఆర్ఆర్'లో ఆ హీరోకి అన్నివేశాలా..?

By - Tupaki Desk
Update: 2020-08-03 09:10 GMT
తెలుగు ఇండస్ట్రీ అగ్రహీరోలు ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చారిత్రక డ్రామాగా, బ్రిటిష్‌ కాలంలో జరిగిన నేపథ్యం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర వైవిధ్యమైన షేడ్స్‌ను కలిగి ఉంటుందని టాలీవుడ్‌ వర్గాలలో టాక్ నడుస్తుంది. శత్రువులను వేటాడటానికి భీమ్ పలు వేషాలలో దర్శనమిస్తాడని సమాచారం. ఈ క్రమంలో ఎన్టీఆర్ లుక్స్ లో వైవిధ్యతను రాజమౌళి ఫుల్లుగా కాప్చర్ చేస్తున్నాడట. దాదాపు ఆరు వేషాలలో ఎన్టీఆర్ కనిపించనున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఒక లుక్‌లో రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేయగా.. మరో ముఖ్యమైన షెడ్యూల్‌ కోసం ఎన్టీఆర్ ఇంకాస్త బాడీ పెంచే పనిలో పడ్డాడట. ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర కోసమైనా ఏమైనా చేస్తాడు. అలాగే పాత్రల విషయంలో అస్సలు రాజీపడడు రాజమౌళి.

ఎన్టీఆర్‌ను ఇంతవరకు చూడని విధంగా సరికొత్తగా చూపించేందుకు ఆర్ఆర్ఆర్ టీం ప్రయత్నిస్తున్నారని సమాచారం. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిపేసి ఇళ్లకే పరిమితమయ్యారు చిత్రబృందం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే..  ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో ప్రతినాయకుడి ఛాయలు కనిపిస్తాయని.. ఒక అడవి దొంగగా కూడా కనిపించబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ సాధారణంగా.. ఇంకొన్ని సన్నివేశాల్లో కండలు తిరిగిన దేహంతో ఉంటారట. అందుకోసం తారక్‌ తన బాడీని మేకోవర్‌ చేసే పనిలో ఉన్నారట. ఇక ఎన్టీఆర్ సరసన ఇద్దరు నాయికలు ఉంటారని వినికిడి. ఒకరు ఒలీవియా మోరిస్ కాగా మరొకరు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అసలు ఎన్టీఆర్ ఎలా కనిపిస్తారనేది కాస్త సస్పెన్స్‌. ఇక ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తుండగా.. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Tags:    
  • RRR Shooting 
  • Rajamouli 
  • RRR 
  • Ram Charan 
  • Ntr 
  • Alluri Seetharamaraju 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 

Similar News

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS