అన్నట్లే ఆర్జీవీ చేస్తున్న రచయిత

Update: 2020-02-10 09:00 GMT
ఇక్కడ అక్కడ తేడా లేకుండా ఎక్కడ అయినా కూడా వివాదాస్పద సినిమాలు తీయడంలో రామ్‌ గోపాల్‌ వర్మ తర్వాతే ఎవరైనా అనే విషయం అందరికి తెలుసు. వర్మ ఏం చేసినా సంచలనమే.. ఎలా సినిమా తీసినా కూడా సంచలనమే. అలాంటివి వర్మ స్పెషల్‌ గా వివాదాస్పదన అంశంను తీసుకుని సినిమా తీస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమద్య వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్‌ సందర్బంగా వర్మకు రచయిత జొన్నవిత్తులకు చర్చ హోరా హోరీ సాగింది.

జోన్నవిత్తులను వర్మ చాలా అవమానకరంగా మాట్లాడాడు. జొన్నవిత్తుల బెడ్‌ రూం విషయాలను కూడా వర్మ ఎత్తాడు. దాంతో చాలా హర్ట్‌ అయిన జొన్నవిత్తుల ఆ సమయంలోనే వర్మపై సినిమా తీసి అతడి బండారాలను బయట పెడతానంటూ ప్రకటించాడు. అయితే ఆవేశంలో ఆ సమయంలో అని ఉంటాడు.. ఆ తర్వాత దాన్ని వదిలేస్తాడులే అనుకున్నారు. కాని ఆర్జీవీ అనే టైటిల్‌ తో వర్మపై సినిమాను మొదలు పెడుతున్నట్లుగా జొన్నవిత్తుల టీం నుండి ప్రకటన వచ్చింది.

వర్మ ఎలాంటి టైటిల్స్‌ అయినా.. ఎలాంటి నేపథ్యాలైనా పెట్టి సినిమా తీయగలడు. కాని ఇతరులు అలాంటి ప్రయత్నాలు చేస్తే వర్కౌట్‌ అయిన సమయాలు చాలా తక్కువ. ఇప్పుడు జొన్నవిత్తుల సినిమా మొదలు పెడుతున్నాడు. ఒక వ్యక్తికి స్వేచ్చ పేరుతో మితిమీరి ప్రవర్తిస్తే చివరకు ఏమవుతుంది అనేది ఈ చిత్రంలో జొన్నవిత్తుల చూపించబోతున్నాడట. రచయితగా ఎన్నో సినిమాలకు చేసిన జొన్నవిత్తుల దర్శకుడిగా ఆర్జీవీని ఎలా తీస్తాడో చూడాలి.
Tags:    

Similar News