బాహుబలి ద్వారా రాని గుర్తింపు ఇప్పుడు వచ్చింది
టాలీవుడ్ లో తెరకెక్కిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇండియాస్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీగా బాహుబలి సినిమా నిలిచింది అనడంలో సందేహం లేదు. అద్బుతమైన విజువల్ వండర్ గా రూపొందిన బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. రాజమౌళికి హాలీవుడ్ రేంజ్ దర్శకుడిగా గుర్తింపు దక్కింది. ఇంకా ఎంతో మంది ఎన్నో రకాలుగా స్టార్స్ గా నిలిచారు. అలాంటి బాహుబలిలో కనిపించిన నటుడు జాన్ కొక్కెన్ కు మాత్రం పెద్దగా గుర్తింపు దక్కలేదు. కాని తాజాగా ఆయన నటించిన సార్పట్ట సినిమా మాత్రం ఆయన్ను తెలుగు మరియు తమిళంలో స్టార్ గా నిలిపింది.
ఒక నెటిజన్ తాజాగా బాహుబలిలో కాలకేయ గెటప్ లో ఉన్న జాన్ కొక్కెన్ ను గుర్తించి ఆ స్క్రీన్ షాట్ ను ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశాడు. వేటపులి పాత్రను సార్పట్టలో పోషించిన జాన్ కొక్కెన్ కు ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈయన బాహుబలిలో ఉన్నాడు అంటే అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాలకేయ ఫైటర్ గా అందులో నటించాడు. బాహుబలి కాలకేయ అంటే ప్రభాకర్ మాత్రమే అందరికి గుర్తుకు వస్తాడు. ఇతరులు చాలా మంది ఉన్నా కూడా వారికి పెద్దగా ప్రాముఖ్యత లేదు.
ఒక వేళ వారు అంతకు ముందే గుర్తింపు ఉన్నా కూడా గుర్తించడానికి లేకుండా వారి మేకప్ ఉంది. బాహుబలి తర్వాత పలు సినిమాల్లో నటించాడు. అజిత్ తో ఒక సినిమాలో నటిస్తున్న సమయంలో ఖచ్చితంగా నిన్ను అందరు గుర్తించే స్థాయికి ఎదుగుతావు అన్నారు. ఆయన అన్నట్లుగానే ఇప్పుడు సార్పట్ట వల్ల నన్ను తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకులు గుర్తిస్తున్నారు. నా బాహుబలి జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా ద్వారా ఆ వ్యక్తి గరించి షేర్ చేశాడు. తెలుగు లో ఇప్పటికే ఈయన ఎవడు మరియు నేనొక్కడినే సినిమాల్లో నటించాడు. కేజీఎఫ్ లో కూడా ఈయన నటించినా కూడా గుర్తింపు వచ్చేంతగా మాత్రం ఆయన పాత్రలు లేవు. కాని సార్పట్ట మాత్రం ఆయన్ను నటుడిగా ఎక్కడో నిలబెట్టింది. అందుకే దర్శకుడు రంజిత్ పా కు జాన్ కొక్కెన్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.