టాలీవుడ్ లో జాన్ అబ్రహాం అరంగేట్రం
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం ప్రస్తుతం ఓ క్రేజీ ప్రాజెక్టును తనే నిర్మించి నటిస్తున్నాడు. రాకీ హ్యాండ్సమ్ టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ మూవీపై జాన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ మూవీ రీమేక్ రైట్స్ కోసం ఇప్పటికే జాన్ అబ్రహాంకి చాలా ఎంక్వైరీలు వచ్చాయి.
రాకీ హ్యాండ్సమ్ మూవీని ఇతర భాషల్లో రీమేక్ చేసే రైట్స్ ఇచ్చేందుకు జాన్ అబ్రహాం సిద్ధంగా లేడు. ఇప్పుడు తెలుగు - తమిళ్ లో ఈ సినిమాని రీమేక్ చేసేందుకు సిద్ధమైపోయినా ఈ హీరో.. ఇక్కడ కూడా తనే నటించాలని డిసైడ్ అయ్యాడట. సౌత్ లాంగ్వేజెస్ లో కూడా జాన్ అబ్రహాం స్వయంగా నిర్మించేందుకు సిద్ధపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జాన్ అబ్రహాంకి జంటగా.. రాకీ హ్యాండ్సమ్ లో శృతి హాసన్ నటించింది. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించగా.. తెలుగు తమిళ వెర్షన్లకు కూడా ఇదే టీం ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద సౌత్ పై దండయాత్రకు జాన్ అబ్రహాం సిద్ధమైపోయాడన్నది ఫిక్స్.