#చెర్రీ.. వేసవి తర్వాత జెర్సీ దర్శకుడితో?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి కోవిడ్ 19 పాజిటివ్ అన్న వార్తలతో అభిమానుల్లో ఆందోళన నెలకొనగా.. తనతో కలిసి పని చేసిన వారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇకపోతే రామ్ చరణ్ కి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అపోలో బృందాలు పక్కా ప్రణాళికతో ఉన్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణలో ఉన్న రామ్ చరణ్ తదుపరి ఆచార్య సెట్స్ లో జాయిన్ కావాల్సి ఉంది. అలాగే ఆర్.ఆర్.ఆర్ కి చిన్నపాటి బ్రేక్ ఇచ్చి ఫిబ్రవరి నాటికి పూర్తయ్యే షెడ్యూల్ లో చేరతారని కూడా కథనాలొస్తున్నాయి.
మరోవైపు నవతరం దర్శకుల్లో జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరికి చరణ్ కమిట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం బాలీవుడ్ లో జెర్సీ రీమేక్ (షాహిద్ హీరో) కి దర్శకత్వం వహిస్తున్నారు. తదుపరి చరణ్ తో సినిమా చేస్తారు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తారు. వచ్చే ఏడాది వేసవి తరువాత ఈ సినిమా సెట్స్ కెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ త్వరగా కోవిడ్ మహమ్మారీ నుంచి కోలుకుని యథావిధిగా షూటింగుల్లో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.