• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్రివిక్రమ్ రిలీజ్ చేసిన...

త్రివిక్రమ్ రిలీజ్ చేసిన పోస్టరేదో బాగుందే..

By - Tupaki Desk
Update: 2016-02-14 09:30 GMT
‘ఇడియట్’ రోజుల నుంచి కమెడియన్ శ్రీనివాసరెడ్డి తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. మరీ పెద్ద పాత్రలు చేయకున్నా.. చిన్న చిన్న పాత్రల్లోనే తన ప్రత్యేకత చాటుకుంటూ వచ్చాడు శ్రీనివాసరెడ్డి. హీరోలకు - విలన్లకు - స్టార్ కమెడియన్ల వెనక నిలబడి పంచులు వేసే క్యారెక్టర్లలో చాలాసార్లు చెలరేగిపోయాడు శ్రీనివాసరెడ్డి. మంచి కామెడీ టైమింగ్ ఉన్న శ్రీనివాసరెడ్డిని మన రచయితలు, దర్శకులు సరిగా వాడుకోవట్లేదేమో అన్న ఫీలింగ్ చాలామందిలో ఉంది. ఐతే కమెడియన్ గా అనుకున్న స్థాయి అందుకోలేకపోయినా.. ఆ మధ్య సడెన్ గా ‘గీతాంజలి’ సినిమాతో హీరో లాంటి వేషం సంపాదించాడు శ్రీనివాసరెడ్డి. ఆ సినిమా మంచి విజయాన్నందుకోవడంతో శ్రీనివాసరెడ్డికి ఈసారి పూర్తి స్థాయి హీరో వేషమే దక్కింది.

జయమ్ము నిశ్చయమ్మురా.. ఇదీ శ్రీనివాసరెడ్డి హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా. శివరాజ్ కనుమూరి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బస్సులో రోడ్ జర్నీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఓ అబ్బాయి-అమ్మాయి కలిసి కరీం నగర్ నుంచి కాకినాడకు.. కాకినాడ నుంచి కరీంనగర్ కు ప్రయాణం చేసే క్రమంలో వాళ్లిద్దరి మధ్య ఎలాటి రిలేషన్ ఏర్పడిందో చూపించబోతున్నాడు కొత్త దర్శకుడు. శివరాజ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ సినిమా వీడియో పోస్టర్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్-నితిన్ కలిసి విడుదల చేయడం విశేషం. ఈ వీడియో పోస్టర్ కూడా వైవిధ్యంగా ఉండి.. జనాల్ని బాగానే ఆకట్టుకుంటోంది. శ్రీనివాసరెడ్డి హీరోగా మరో సక్సెస్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Full View

Tags:    
  • Srinivas Reddy 
  • Jayammu Nischayammura Movie 
  • Telugu NEws 

Similar News

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS