ఆక్సిజన్ అలా.. జవాన్ ఇలా..

Update: 2017-12-04 11:52 GMT
గత నెల నుంచి చిన్న సినిమాలు ఏ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి మార్కెట్ లేని ఇమేజ్ లేని సినిమాలను కూడా కథ మీద నమ్మకంతో రిలీజ్ చేశారు. కానీ ఎవ్వరు బాక్స్ ఆఫీస్ లెవెల్ లో హిట్స్ అందుకోలేకపోయారు. కానీ ఫైనల్ గా సినిమా కొన్ని రోజుల వరకు ఆడితే హిట్ అంటున్నారు గాని కలెక్షన్స్ పరంగా ఏ మాత్రం హిట్స్ అందుకోలేవు. ఇకపోతే నవంబరే అనుకుంటే డిసెంబర్ లో కూడా కొంచెం స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు దాదాపు అదే బ్యాడ్ లక్ ని చూశారు.

స్వదేశీ కలెక్షన్స్ గురించి పక్కనపెడితే.. ఎక్కువగా యూఎస్ బాక్స్ ఆఫీస్ లో మన సినిమాలకు మంచి మార్కెట్ ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. చిన్న సినిమాలు కూడా ఒక్కోసారి మంచి కలెక్షన్స్ అందుకుంటాయి. కానీ గత నెల నుంచి ఏ సినిమా అమెరికాలో అంతగా ప్రభావం చూపలేకపోయాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన జవాన్ - ఆక్సిజన్ పరిస్థితి కూడా మొదటి వారమే తేలిపోయింది. ఆక్సిజన్ అయితే మరి దారుణమైన కలెక్షన్స్ ని రాబట్టింది. సాదారణంగా గోపీచంద్ కి అక్కడ మార్కెట్ ఎక్కువగా లేదు.

దీంతో ఆక్సిజన్ డిజాస్టార్ అని తేలడంతో ఫస్ట్ వీకెండ్ సినిమా  $ 21k (రూ. 13.65 లక్షలు) లను రాబట్టింది. ఇక జవాన్ విషయానికి వస్తే ప్రీమియర్ షోల్లో సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బెస్ట్ అని తేలినా తన స్థాయి వరకు సాయి అందుకోలేకపోయాడు. లాభాలు అయితే ఆ సినిమాకు ఏమి రాలేదు. మొత్తంగా ఓపెనింగ్ వీకెండ్ సినిమా $151k మార్క్ ను అందుకుంది. ప్రీమియర్స్ నుండి $ 45230, శుక్రవారం: $ 37936, శనివారం $ 42228, ఆదివారం: 25k (సుమారు) మొత్తంగా కలుపుకుని.. షుమారు $ 150834 వసూలు చేసింది.
Tags:    

Similar News