ఈ సారి అమిర్ తో స్టెప్పేయిస్తాడట

Update: 2017-10-31 11:18 GMT
ఏ రంగంలో అయినా టాలెంట్ ఉన్నోడిని ఎవ్వరు ఆపలేరు. మొదటి అవకాశం వచ్చిందంటే చాలు చివరి అవకాశం వరకు బిజీగా ఉంటారు.ముఖ్యంగా సిని ఇండస్ట్రీలో అయితే ఒక్క నిర్మాతకు తప్పా అందరికి టాలెంట్ అవసరం. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న యువకులు బానే ఉన్నారు. ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్స్ కి మంచి ఆదరణ దక్కుతోంది.

టాలీవుడ్ లో డ్యాన్సులు ఇరగదీసే స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. వారు డ్యాన్సులతో విజిల్స్ వేయిస్తున్నారంటే ఆ గొప్పతనం నృత్య దర్శకులదే అని చెప్పాలి. మన హీరోల డ్యాన్సులను చూసి పరభాషా నటులు కూడా చాలా ఇష్టపడుతున్నారు. దీంతో వారి సినిమాలకు కూడా టీ టౌన్ కొరియోగ్రాఫర్స్ ని తీసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆ విధంగా అవకాశాలు దక్కించుకుంటున్న వారిలో జానీ మాస్టర్ ఒకరు. తెలుగులో రామ్ చరణ్ - అల్లు అర్జున్ అలాగే ఇతర స్టార్ హీరోలతో స్టెప్పులు వేయించిన జానీ బాలీవుడ్ లో కూడా అవకాశాలను బాగానే దక్కించుకుంటున్నాడు.

జయహో సినిమా ద్వారా సల్మాన్ ఖాన్ తో స్టెప్పులు వేయించే అవకాశం దక్కించుకున్న జానీ మాస్టర్ ఇప్పుడు అమిర్ ఖాన్ సినిమాకు కూడా అవకాశం దక్కించుకున్నాడు. రీసెంట్ గా అమిర్ ఖాన్ తో దిగిన ఒక ఫొటోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి త్వరలోనే ఆయనతో వర్క్ చేయబోతున్నట్లు చెప్పాడు ఈ కొరియోగ్రాఫర్.    


Tags:    

Similar News