న‌ట‌వార‌సురాళ్ల న‌డుమ అగ్గి రాజేస్తున్న `ఫ్యాష‌న్ ఫేసాఫ్‌`

Update: 2021-02-02 23:30 GMT
బాలీవుడ్ లో న‌ట‌వార‌సురాళ్ల న‌డుమ `ఫ్యాష‌న్ ఫేసాఫ్` చ‌డీ చ‌ప్పుడు లేకుండా హీట్ పెంచేస్తోంది. ఇటీవ‌ల వ‌రుస‌గా అర‌డ‌జ‌ను మంది భామ‌లు హిందీ తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఈ భామ‌లంతా ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించేందుకు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. ఆ క్ర‌మంలోనే హిడెన్ వార్ తాజాగా బ‌య‌ట‌ప‌డుతోంది. ముఖ్యంగా # ఫ్యాష‌న్ ఫేస్ ఆఫ్ అనేది స్ప‌ష్టంగా ఎలివేట్ అవుతోంది.

న‌ట‌వార‌సురాళ్లు `జాన్వీ వ‌ర్సెస్ సారా అలీఖాన్` ఫ్యాష‌న్ ఫేసాఫ్ ప్ర‌స్తుతం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ భామ‌లిద్ద‌రూ కెరీర్ ఆరంభం నుంచి ఎవ‌రి ప్ర‌త్యేక‌త‌ను వారు నిలుపుకుంటూ ఫ్యాష‌న్ ప‌రంగా స‌త్తా చాటుతున్నారు. జిమ్ కి వెళ్లినా లేదా యోగా క్లాసుల‌కు వెళ్లినా.. ప‌బ్లిక్ లో అప్పియ‌రెన్స్ విష‌యంలో ఎంతో సెలెక్టివ్ గా ఎంతో తెలివిగానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఏం చేస్తే జనం క‌ళ్లు త‌మ‌ను వెంబ‌డిస్తాయో అది చేయ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు ఈ యంగ్ కిలాడీ బ్యూటీస్. కెరీర్ ఆరంభ‌మే జాన్వీ చిట్టి పొట్టి నిక్క‌ర్ల‌తో వేడి పెంచింది. అప్ప‌ట్లో పొడ‌వాటి టాప్ ని ధ‌రించి ప‌బ్లిక్ గా వీధుల్లో షికార్లు చేసిన జాన్వీ  బాట‌మ్ వేర్ ని మ‌రిచిందంటూ వైర‌ల్ గా చ‌ర్చ‌ల్లోకొచ్చింది. ఇక ఇదే తీరుగా ఇటీవ‌ల సారా అలీఖాన్ సైతం పొడ‌వాటి టాప్ ని ధ‌రించి బాట‌మ్ ని మ‌రిచింది. ఇక టాప్ టు బాట‌మ్ స్పెషల్ ఎలివేష‌న్ ఉన్న అల్ట్రా మోడ్ర‌న్ దుస్తుల్లోనూ వేడెక్కించి ఈ స్టార్ కిడ్స్ చ‌ర్చకు తెర తీసారు.

తాజా ప‌బ్లిక్ ఔటింగ్ లో జాన్వీ క‌పూర్ బ్లాక్ టాప్ ఫుల్ డ‌ఫెల్ ఫ్యాంటుతో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక ఇంత‌కుముందు సారా అలీఖాన్ .. ట్రిపుల్ మ్యాచింగ్ డిజైన‌ర్ డ్రెస్ లో క‌నిపించి వ్వావ్ అనిపించింది. ఇదంతా న‌ట‌వార‌సురాళ్ల న‌డుమ అన్ లిమిటెడ్ హిడెన్ కాంపిటీష‌న్ ని ఆవిష్క‌రిస్తోంది. ఇక కెరీర్ ప‌రంగా ఎవ‌రికి వారు స‌త్తా చాటుతూ భారీ ఆఫ‌ర్ల‌తో అంత‌కంత‌కు వేడి పెంచేయ‌డంలోనూ ముందుంటున్నారు. జాన్వీ.. సారాల కెరీర్ ఇప్ప‌టికే పెద్ద స్థాయిలో షేప‌ప్ అయ్యి ఉంది. క‌ర‌ణ్ జోహార్ స‌హా ప‌లువురు టాప్ ప్రొడ్యూస‌ర్లు ఈ భామ‌లిద్ద‌రికీ అవ‌కాశాలిస్తున్నారు. స్టార్ హీరోలు వెల్ కం ఆఫ‌ర్ల‌తో కుర్ర‌భామ‌ల‌కు వ‌లేస్తున్నారు. ఈ భామ‌లిద్ద‌రూ వ‌రుస‌గా మ‌ల్టీస్టార‌ర్ల‌లో న‌టిస్తూనే సోలో నాయిక‌లుగా నిరూపించుకునేందుకు ఉన్న ఏ అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌డం లేదు. జాన్వీ .. సారా త్వ‌ర‌లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే అన‌న్య పాండే తెలుగు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఆఫ‌ర్ అందుకుంది. మునుముందు బాలీవుడ్ న‌ట‌వార‌సురాళ్లు తెలుగ చిత్ర‌సీమ‌లోకి ప్ర‌వేశించే వీలుంద‌న్న‌ది ఫ్యాన్స్ అంచ‌నా.
Tags:    

Similar News