శీతాకాలం ట్రీట్.. స్టార్ డాట‌ర్ క్రికెట్ ఆట‌!

Update: 2021-01-31 09:30 GMT
`క్రికెట్ - సినిమా` అనుబంధం గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. క్రికెట‌ర్ల‌ను ప్రేమించి పెళ్లాడేయ‌డంలో ఘ‌నాపాటీలు మ‌న క‌థానాయిక‌లు. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో క‌లిసి న‌టించ‌డం ఆపై ప‌రిచ‌యం కాస్తా ప్రేమగా మారాక అది ప్రేమానుబంధంగా మారుతుంది. విరుష్క బంధం అలానే సాధ్య‌ప‌డింది. అలా హిస్ట‌రీలో ఎన్నో ప్రేమ జంట‌లు అంద‌రికీ తెలిసిన వ్య‌వ‌హార‌మే.

ఇక క్రికెట్ ఆటపై స్టార్ల ప్రేమ గురించి సుప‌రిచిత‌మే. ఇటీవ‌ల ఆసీస్ పై టెస్ట్ టోర్నీ గెలిచిన సంద‌ర్భంగా విరాట్ సేన‌ను పొగిడేయ‌డంలో స్టార్లు పోటీప‌డ్డారు. అదంతా సరే కానీ.. మ‌న స్టార్లు ఆట‌విడుపుగా ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే గేమ్ ఏది? అంటే క్రికెట్. ఇండ్లలోనే కిడ్స్ తో బ్యాట్ బాల్ ప‌ట్టి స‌ర‌దాగా ఆడేయ‌డం చూసేదే.

అదే తీరుగా అతిలోక సుంద‌రి జాన్వీ క‌పూర్ క్రికెట్ ఆట ఆడింది. ఒక‌ శీతాకాలపు మధ్యాహ్నం ఉత్తమ సమయం!! అంటూ జాన్వీ ఈ ఆట‌ను ఆడేయ‌డం ఆస‌క్తిక‌రం.  జాన్వీ బ్యాట్ తో బంతిని కొడుతున్న వీడియో వైర‌ల్ గా మారింది ఇపుడు. పాటియాలా సల్వార్ కమీజ్ - జాకెట్ ధరించి జాన్వీ ఆట‌కు ఉప‌క్ర‌మించిందని వీడియో చూస్తే అర్థ‌మ‌వుతోంది. ``నేను ప్రో అయ్యాను అని చెప్పడం సురక్షితమేనా`` అన్న వ్యాఖ్య‌ను జాన్వి ఈ వీడియోకి జోడించింది.

ఇంత‌కుముందు ఆయుష్మాన్ ఖుర్రానా- సన్నీ లియోన్ సోషల్ మీడియాలో క్రికెట్ ఆడుతున్న‌ వీడియోలను పోస్ట్ చేశారు. ఇప్పుడు జాన్వీ వంతు. తీరిక స‌మ‌యాల్ని బాలీవుడ్ స్టార్లు ఎలా స‌ద్వినియోగం చేస్తున్నారో దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక కెరీర్ సంగ‌తి చూస్తే జాన్వీ ఇటీవ‌ల గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం పంజాబ్ లో చిత్రీకరిస్తున్న గుడ్ లక్ జెర్రీ సెట్స్ కి హాజ‌రైంది. సిద్దార్థ్ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్న చిత్ర‌మిది. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్- మీతా వశిష్ఠ్‌- నీరజ్ సూద్-  త‌దిత‌రులు నటిస్తున్నారు.  రూహి అఫ్జానా - దోస్తానా 2 ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌లో ఉన్నాయి.
Tags:    

Similar News