షూటింగ్ డిస్ట్రబ్ అయ్యాక ముంబైలో ఫ్రెండ్ ఇంటికి..!
బాలీవుడ్ అందాల కథానాయిక జాన్వి కపూర్ `గుడ్ లక్ జెర్రీ` చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసినదే. ట్యాలెంటెడ్ ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల షూటింగ్ చండీగర్ లో ప్రారంభమైంది. అయితే ఊహించని విధంగా రైతుల నిరసన కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. రైతులకు అనుకూలంగా నినదించాలని ఆందోళనకారులు జాన్వీని డిమాండ్ చేయగా గొడవ వాతావరణం వేడెక్కించింది.
అయితే షూటింగ్ ఆగిపోవడమే గాక.. తాజాగా ఈ చిత్రం నుండి జాన్వి లుక్ లీకై అది అంతర్జాలంలో వైరల్ గా మారింది. జాన్వి సిల్వర్ పఫర్ జాకెట్ ధరించి సల్వార్-కమీజ్ తో కనిపించింది. షూటింగ్ సందర్భంగా క్రికెట్ ఆడుతున్న వీడియోను జాన్వీ స్వయంగా పంచుకున్నారు. అనంతరం తన లుక్ వైరల్ అయ్యింది. రైతు నిరసనల అనంతరం జాన్వీ ముంబైకి చేరుకుంది.
తాజాగా జాన్వీ మరో కొత్త లుక్ తో ఆరుబయట దర్శనమిచ్చింది. ఈ రోజు ముంబై జుహులో తన స్నేహితుడిని కలిసిన తరువాత జాన్వీ కార్ వైపు వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. సింపుల్ స్లీవ్ లెస్ బ్లాక్ టాప్ తో జిమ్ ప్యాంట్ ధరించి జాన్వీ ఆకట్టుకుంది.
ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో యువహీరో కార్తీక్ ఆర్యన్ ను అన్ ఫాలో చేయడంతో వాడి వేడిగా వార్తల్లో నిలిచింది. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నా.. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యిందని అభిమానుల్లో చర్చ సాగింది. ఇక కెరీర్ పరంగా జాన్వీ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసినదే.