'లెజెండ్' ముందు పరిస్థితి ఎంతదయనీయమంటే..
తెలుగులో సుదీర్ఘమైన కెరీర్ ఉన్న నటుల్లో జగపతిబాబు ఒకడు. ఆయనది దాదాపు మూడు దశాబ్దాల ప్రస్థానం. హీరోగా నిలదొక్కుకోవడానికి మొదట్లో కష్టపడ్డా.. ఆ తర్వాత మంచి స్థాయికి చేరుకున్నాడు.కానీ ఒక దశ దాటాక వరుసగా పరాజయాలు పలకరించడంతో హీరోగా ఆయన మార్కెట్ పడిపోయింది. చిన్నా చితకా సినిమాలకు పడిపోయి.. చివరికి అసలు అవకాశాలే రాని స్థితికి చేరుకున్నారు. అలాంటి స్థితిలో ‘లెజెండ్’ సినిమాలో విలన్ పాత్ర చేయడం జగపతి కెరీర్ ను గొప్ప మలుపు తిప్పింది. ఆ సినిమా అవకాశం ఎలా వచ్చిందో.. దానికి ముందు తాను ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నానో జగపతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘‘నేను అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక వ్యక్తి ఆటోలో మా ఇంటికి వచ్చాడు. తాను ఒక సినిమా తీయబోతున్నానని.. దానికి దర్శకుడు.. నిర్మాత.. హీరో అనీని తానేనన్నాడు. మరి నేనేంటి అని అడిగితే.. క్యారెక్టర్ రోల్ చేయాలి అన్నాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. అలాంటి స్థితిలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఊరికే అలా ఒక ఫొటో షూట్ చేశాను. అప్పుడే బోయపాటి లెజెండ్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. నా ఫొటో షూట్లోని ఒక ఫొటో ఆయన కంట పడింది. తర్వాత నన్ను అప్రోచ్ అయ్యారు. ఆ ఫొటో షూట్ చేసిన ఫొటోగ్రాఫర్ కు రుణపడి ఉంటా. ‘లెజెండ్’ చిత్రంలో విలన్ గా నన్ను అనుకుంటున్నారని తెలిశాక ఫోన్ కోసం ఎదురుచూశా. పది రోజులు గడచినా ఫోన్ రాలేదు. చివరకు నన్ను ఎంపిక చేసి పారితోషకం మాట్లాడేందుకు వచ్చారు. నేనొక ఫిగర్ అనుకున్నా. వాళ్లు దానికి డబుల్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు. ఎగిరి గంతేసినంత పని చేశా. వెంటనే ‘లెజెండ్’ సినిమాలో నటించడం.. అది ఘనవిజయం సాధించడం.. నా కెరీర్ మలుపు తిరగడం జరిగాయి’’ అని జగపతి చెప్పాడు.