ఫోటో స్టోరి: హీరో కోసం కట్ చేయించింది

Update: 2017-08-20 09:54 GMT
ఆగస్టు 25న రిలీజ్ అవుతున్న 'ఏ జెంటిల్మన్' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది శ్రీలంకన్ సోయగం జాక్విలిన్ ఫెర్నాండెజ్. అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు ఎలాగైతే సినిమాను అడ్డూఆపూ లేకుండా ప్రమోట్ చేస్తారో తను కూడా అదే రూటు ఫాలో అవుతోంది. తన గ్లామర్ తో చంపేస్తోంది.

ఆల్రెడీ ఈ సినిమాలో పోల్ డ్యాన్సింగు నుండి బికినీల వరకు.. ఎక్కువ నిడివి ఉన్న పెదాల ముద్దుల నుండి బీచుల్లో రెచ్చిపోయి అందాలను ఆరబోయడం వరకు.. అబ్బో అన్నీ చేసిపాడేసింది. ఇక సినిమా ప్రమోషన్ల విషయానికొస్తే అమ్మడు చివరకు హోటల్ రూమ్ నుండి కూడా కొత్త కొత్త యాంగిల్స్ లో సెల్ఫీలు పెడుతూ రచ్చలేపుతోంది.

ఇక్కడ చూడండి అద్దంలో తనను తాను చూసుకుంటూ.. తన బ్యాక్ అందాల నుండి కళ్లలోని మత్తు వరకు అన్నింటినీ దారబోస్తూ.. నా హీరోకు పొడుగు జుట్టు ఇష్టం ఉండదు.. అందుకే ఆ జెంటిల్మన్ కోసం పొట్టిగా హెయిర్ కట్ చేసుకున్నా అంటూ ఈ ఫోటో షేర్ చేసింది. ఎవరైనా కూడా ఈ రచ్చంతా ఏంటి నానా అని అడుగుతారేమో కాని.. సినిమా రిలీజ్ దగ్గర్లో ఉంది కాబట్టి జాకీకి తప్పదులే మరి.
Tags:    

Similar News