• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ స్టార్ ఓపెన్ ఆఫర్.....

సూపర్ స్టార్ ఓపెన్ ఆఫర్.. కరోనాకు చెక్ పెట్టే ముందు కనిపెడితే రూ.కోటి నజరానా

By - Tupaki Desk
Update: 2020-02-11 08:00 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టే మందు కనిపెడితే భారీ నజరానాను ప్రకటించారు ప్రముఖ నటుడు జాకీచాన్. ఇప్పటికే వందలాది ప్రాణాల్ని తీసుకున్న ఈ మాయదారి వైరస్ అంతు చూసే వ్యాక్సిన్ ను కనిపెట్టిన వారికి రూ.కోటి ఇస్తానని ఆయన ఓపెన్ ఆపర్ ఇచ్చేశారు. ఆగ్రరాజ్యమైన డ్రాగన్ దేశం కరోనా వైరస్ తో ఎంతలా ఉక్కిరిబిక్కిరి అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ వైరస్ ను పిశాచితో పోలుస్తూ చైనా అధ్యక్షుడు ప్రకటించటమే కాదు.. దానితో తాము పోరాటం చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. వేలాది మందికి వ్యాపిస్తున్న కరోనాను ఎలా కట్టడి చేయాలో అర్థం కాక చైనా కిందామీదా పడుతోంది. ఇప్పటికే పలు నగరాల్ని సీల్ చేసేసింది కూడా. రవాణా సౌకర్యాల్ని బంద్ చేసింది. కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు వీలుగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితాలు మాత్రం రాని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తన వంతుగా కరోనాకు మందు కనుక్కుంటే రూ.కోటి నజరానా ప్రకటించిన జాకీచాన్.. మరోవైపు పలు సహాయక కార్యక్రమాల్ని షురూ చేశారు. తన వంతు బాధ్యతగా కరోనా మహ్మమారికి పుట్టిల్లు అయిన వూహాన్ లో మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే మాస్కుల కొరత తీవ్రంగా ఉన్న వేళ.. వాటిని పంపిణీ చేయటం ద్వారా తనకు చేతనైనంత చేస్తున్నారు. సైన్స్.. టెక్నాలజీ కలిస్తే కరోనా వైరస్ కు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

త్వరలోనే దీనికి విరుగుడు లభిస్తుందన్నారు. కరోనా వైరస్ కు మందు కనిపెట్టే సత్తా చాలామందిలో ఉందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ.. వారికి తాను ప్రకటించిన మొత్తాన్ని అందజేస్తానని పేర్కొన్నారు. మిగిలిన ప్రముఖ నటులకు భిన్నంగా జాకీచాన్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    
  • Jackie Chan to Reward Corona Virus with 1 Million Yuan 
  • Corona in China 
  • Corona in China 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS