'గాలోడు' టీజ‌ర్ : మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్‌

Update: 2021-12-31 09:05 GMT
బుల్లితెర కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్‌. హైప‌ర్ ఆది, ఆటో రాం ప్ర‌సాద్ ల‌తో క‌లిసి సుధీర్ చేసే ర‌చ్చ మామూలుగా వుండ‌దు. ఇదే స్టేజ్ పై యాంక‌ర్ ర‌ష్మీగౌత‌మ్ తో పులిహోర క‌లిపేస్తుంటాడు. ఈ యాంగిల్ కార‌ణంగానే సుడిగాలి సుధీర్ చాలా వ‌ర‌కు పాపుల‌ర్ అయ్యాడు కూడా. యాంక‌ర్‌గా విష్ణు ప్రియ‌తో క‌లిసి `పోరా పోవే` షో చేసినా పెద్ద‌గా ఫ‌లితం లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ `ఎక్స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోకే బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

ప్ర‌స్తుతం ఢీ13, శ్రీ‌దేవి డ్రామా సెంట‌ర్ షోల‌లో పాల్గొంటూ త‌న‌దైన స్టైల్లో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. `జ‌బ‌ర్ద‌స్త్` కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలి సుధీర్ కు ల‌క్ష‌ల కొద్దీ ఫ్యాన్స్ వున్నారు. ర‌ష్మీ గౌత‌మ్ తో సుడిగాలి సుధీర్ కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ కావ‌డం, ఇద్ద‌రి మ‌ధ్య ప్ర‌తీ సారి ల‌వ్ ట్రాక్ లు న‌డ‌వ‌డంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా చేయాలని చాలా మంది ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు.

దీంతో సుడిగాలి సుధీర్ హీరోగా మారి తొలి ప్ర‌య‌త్నంగా చేసిన చిత్రం `సాఫ్ట్ వేర్ సుధీర్‌`. ధ‌న్య బాల‌కృష్ణ హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమా ఫ‌ర‌వాలేద‌నిపించింది. ఈ చిత్రంలో ధ‌న్య‌కు బ‌దులు ర‌ష్మీ న‌టించాల్సింది. ప్రొడ్యూస‌ర్ ఎంత ప్ర‌య‌త్నించినా ర‌ష్మీ ఆఫ‌ర్ ని తిర‌స్క‌రించింది. దాంతో ఆ ప్లేస్ లో ధ‌న్య బాల‌కృష్ణ‌ని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకోవాల్సి వ‌చ్చింది. సుడిగాలి సుధీర్ ద్వితీయ ప్ర‌య‌త్నంగా చేసిన చిత్రం `త్రీ మంకీస్` గ‌త ఏడాది విడుద‌లైంది.

సుధీర్ సోలో హీరోగా చేస్తున్న తాజా చిత్రం `గాలోడు`. రాజ‌శేఖ‌ర రెడ్డి పులిచ‌ర్ల ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. `సుడిగాలి సుధీర్ `చిత్రం త‌రువాత ఆయ‌న చేస్తున్న రెండ‌వ సినిమా ఇది. ఈమూవీ టీజ‌ర్ ని తాజాగా రిలీజ్ చేశారు. `అదృష్టాన్ని న‌మ్ముకున్న‌ వాళ్లు క‌ష్టాల పాల‌వుతారు...క‌ష్టాన్ని న‌మ్ముకున్న‌ వాళ్లు అదృష్ట‌వంతుల‌వుతారు.. కానీ నేను ఈ రెండింటినీ న‌మ్ముకోను... న‌న్ను నేను న‌మ్ముకుంటా.. అంటూ సుధీర్ చెబుతున్న డైలాగ్ ల‌తో టీజ‌ర్ మొద‌లైంది.

టీజ‌ర్ లో సుడిగాలి సుధీర్ న‌టించిన స‌న్నివేశాలు.. యాక్ష‌న్ బ్లాక్స్ చూస్తుంటే ఎస్టాబ్లిష్డ్ హీరో త‌ర‌హాలో వున్నాయి. ఓవ‌రాల్ గా చెప్పాలంటే `గాలోడు` మూవీతో సుడిగాలి సుధీర్ మాస్ ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్టుగా క‌నిపిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ మూవీ ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

`సాఫ్ట్ వేర్ సుధీర్‌` చిత్రానికి ల‌భించిన ఓపెనింగ్స్‌ ని దృష్టిలో పెట్టుకుని `గాలోడు` ప్రాజెక్ట్ ని మాస్ అంశాల‌తో ప్లాన్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. సుధీర్ ఈ సినిమాతో పాటు `కాలింగ్ స‌హ‌స్ర‌`లోనూ న‌టిస్తున్నాడు. దీనికి సంబంధించిన అప్ డేట్ రావాల్సి వుంది. మ‌రి మాస్ హీరో ఇమేజ్ కోసం సుడిగాలి సుధీర్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు `గాలోడు` సినిమా ఏ మేర‌కు నెర‌వేరుస్తుందో చూడాలి.




Full View
Tags:    

Similar News