ఈ టైంలో విశ్వమే మా ఇద్దరినీ కలిపింది: స్టార్ హీరోయిన్
ముంబైలో మూడు నెలల పాటు ఒకేచోట ఉండటానికి ఈ విశ్వం తనకు సహాయం చేసిందని రకుల్ ప్రీత్ సింగ్ తన లాక్డౌన్ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన సోదరుడు అమన్ ప్రీత్ ఒక మీటింగ్ కోసం ముంబైకి వచ్చి లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయాడని చెప్పింది. ఒకవైపు విమాన సర్వీసులు లేక మరోవైపు కర్ఫ్యూ విధించినందున.. అమన్ నా దగ్గరే ఉండిపోయాడు. లేకపోతే నేను ఒంటరిగా ఉండేదాన్ని. "విశ్వం మా ఇద్దరినీ ఒకే చోట చేర్చి చూసుకున్నట్లు ఉంది" అని రకుల్ తాజాగా పేర్కొంది. ఇక ఇటీవలే ప్రభుత్వం ప్రయాణ సడలింపులు అమలు చేసిన వెంటనే రకుల్ తిరిగి తన స్వస్థలమైన గుర్గావ్‌కు వెళ్ళిపోయింది. ముంబైకి.. ఇక్కడికి తేడా ఏంటని అడిగినప్పుడు.. "మీరు ఇంట్లో మాత్రమే ఉన్నందున ప్రతి ప్రదేశం ఒకేలా ఉంటుంది. పరిష్కారం ఉంటే తప్ప ఇది మారదు" అని సమాధానం ఇచ్చింది రకుల్.
నిజానికి రకుల్ చెప్పింది నిజమే. కరోనా వైరస్ భయం ప్రతి ఒక్కరిని వణికిస్తుంది. ప్రభుత్వం అనేక రాష్ట్రాలలో లాక్ డౌన్ సడలించినప్పటికీ ఎక్కువ మంది ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఇక ఈ కరోనాకి పరిష్కారం ఉంటే తప్ప.. అది టీకా రూపంలో.. మెడిసిన్స్..గాని కనిపెట్టే పరిస్థితి లేదన్నట్లు తెలిపింది. అమ్మడు ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటూ సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటోంది. ఇప్పుడిప్పుడే సినిమాల షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. రకుల్ చేతిలో ప్రస్తుతం కమల్ హాసన్ సరసన భారతీయుడు-2, శివకార్తికేయన్ సరసన అయలన్ సినిమాలు ఉన్నాయి. రెండు కూడా తమిళ సినిమాలే కావడం గమనార్హం. ఎందుకంటే అమ్మడికి తెలుగులో క్రేజ్ పడిపోయింది. ఒక్క అవకాశం కూడా లేదట. చూడాలి మరి మళ్లీ కొత్త అవకాశాలు దక్కించుకొని ఫామ్ లోకి వస్తుందేమో..!