ఇస్మార్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందోచ్!

Update: 2019-05-26 10:23 GMT
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' ప్రస్తుతం చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే.   దీంతో ప్రమోషన్స్ మొదలు పెట్టారు.  రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. 'ఇస్మార్ట్ శంకర్' ను జూలై 12 వ తారీఖున విడుదల చేస్తున్నట్టుగా ఫిలిం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా ఒక కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు.  ఈ పోస్టర్లో ఒక చేత్తో సిగరెట్.. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఒక క్రేజీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు రామ్. రామ్ షర్టుపై పేక ముక్కల డిజైన్ ఉండడంతో డిఫరెంట్ గా ఉంది.  ఇస్మార్ట్ గత ప్రమోషన్ పోస్టర్స్ లాగానే ఇది కూడా కిరాక్ గా ఉంది.  ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మూడు పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉందని సమాచారం. ఈ పాటల చిత్రీకరణ పూర్తి కాగానే ప్రమోషన్స్ లో జోరు పెంచుతారట.

ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్.. నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. పూరి జగన్నాధ్.. ఛార్మీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  పూరి రూపొందించిన సినిమాలు ఈమధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర వరసగా నిరాశపరుస్తున్నాయి. మరి ఈ డబల్ దిమాక్ హైదరాబాది రామ్ క్యారెక్టర్ తో ఈసారి హిట్ సాధిస్తాడా అనేది వేచి చూడాలి. 
Tags:    

Similar News