అలాంటి పాత్రలకు ఇంకా టైం ఉందన్న ఇలియానా

Update: 2020-06-25 12:30 GMT
టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ కు వెళ్లి అక్కడ స్టార్‌ హీరోలతో వరుసగా కొన్నాళ్లు చిత్రాలు చేసి స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న ఇలియానా ప్రస్తుతం మాత్రం పెద్ద గా ఆఫర్లు లేక పోవడం తో మళ్లీ సౌత్‌ వైపు చూస్తోంది. బాలీవుడ్‌ లో ఉన్న ఒకటి రెండు ఆఫర్లు కూడా పూర్తి అయితే అక్కడ ఇంకో ఛాన్స్‌ లభించే అవకాశం చాలా చాలా తక్కువగా ఉందట. అందుకే తెలుగు మరియు తమిళ సినిమాలపై ఈమె దృష్టి పెట్టింది. ఈ క్రమం లోనే ఆమె వద్దకు కొన్ని ఆఫర్లు కూడా వచ్చాటయ. కాని ఏ ఒక్కటి కూడా తన ఇమేజ్‌ కు తగ్గట్లుగా లేవు అంటూ ఇలియానా నో చెప్పిందట.

ఇటీవల నితిన్‌ నటించబోతున్న అంధాదున్‌ రీమేక్‌ కోసం ఇలియానాను సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ ఆఫర్‌ కు ఇలియానా నో చెప్పిందనేది టాక్‌. ఆఫర్లు లేకుండా ఉన్న ఇలియానా మంచి ఆఫర్‌ ను కాదనడం ఏంటా అంటూ అంతా ఆశ్చర్య పోయారు. అసలు విషయం ఏంటీ అంటే రీమేక్‌ లో హీరోయిన్‌ పాత్రకు కాకుండా ఒరిజినల్‌ వర్షన్‌ లో టబు పోషించిన పాత్రకు గాను ఇలియానాను సంప్రదించారట.

అంధాదున్‌ చిత్రంలో టబు కీలక పాత్రలో నటించింది. కాని వయసు ఎక్కువ ఉన్న లేడీ పాత్రలో టబు కనిపించింది. ఆ పాత్రను తెలుగులో ఎవరితో చేయించాలా అనే చర్చ జరుగుతున్న సమయంలో కాస్త మార్పులు చేర్పులు చేసి.. పాత్ర వయసు తగ్గించి ఇలియానాతో చేయిస్తే బాగుంటుందని భావించారట. కాని వయసు తగ్గించినా కూడా అప్పుడే తాను అలాంటి పాత్రలు చేయను అని... అలాంటి పాత్రలకు ఇంకా సమయం ఉందంటూ ఇలియానా సున్నితంగా ఆఫర్‌ ను తిరష్కరించిందట. నితిన్‌ తో హీరోయిన్‌ గా నటించిన ఇలియానా ఆయన సినిమా లో ముఖ్య పాత్ర లో నటించమంటే ఎలా ఒప్పుకుంటుందీ అంటూ కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.
Tags:    

Similar News