ప్ర‌భాస్ కి ధీటైన పాన్ ఇండియా విల‌న్ పుట్ట‌లేదా?

Update: 2020-12-08 06:30 GMT
బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్ర‌క‌టించి షాక్ ఇచ్చాడు డార్లింగ్ ప్ర‌భాస్. అయితే వీట‌న్నిటికీ విల‌న్ల‌ను వెత‌క‌డం ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు అంత సులువేమీ కాద‌ని అర్థ‌మ‌వుతోంద‌ట‌.
 
వ‌రుస‌గా సినిమాల్ని ప్ర‌క‌టించి షెడ్యూల్ ప్ర‌కారం వేగంగా పూర్తి చేయాలంటే ప్ర‌తిదీ వెంట వెంట‌నే సెట్ట‌వ్వాలి. జ‌న‌వ‌రి నుంచి ఆదిపురుష్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌నున్నారు. అటుపైనా ఇత‌ర సినిమాల షెడ్యూల్స్ పైనా చ‌ర్చ‌లు సాగ‌నున్నాయి. ఈ చిత్రాలన్నీ పాన్-ఇండియా ప్రాతిపదికన తెర‌కెక్క‌నున్నాయి. దేశంలోనే అత్యంత భారీ క్రేజ్ ఉన్న స్టార్ల‌ను బ‌రిలో దించుతున్నారు.

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డ‌మ్ కి త‌గ్గ‌ట్టే అత‌డి సరసన విలన్ పాత్ర పోషించేవాళ్లు భారీ స్టార్ డ‌మ్ క‌లిగిన వారే అయ్యుండాలి. ఆదిపురుష్ 3డి మేకర్స్ సైఫ్ ని విలన్ గా ప్రకటించినా.. తెలుగు అభిమానులు ఏమాత్రం హ‌ర్షించ‌లేదు. అంత‌కుమించిన పెద్ద స్టార్ ఈ పాత్ర చేయాలని కోరుకున్నారు.

అదే సమస్య నాగ్ అశ్విన్.. ప్ర‌శాంత్ నీల్ కి ఎదుర‌వుతోంద‌ట‌. ప్రభాస్ ‌తో భారీ సైన్స్ ఫిక్ష‌న్ మూవీని ప్లాన్ చేస్తున్న నాగ్ అశ్విన్.. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని ప్లాన్ చేస్తున్న‌ ప్రశాంత్ నీల్ తమ సినిమాల్లో న‌టించే విల‌న్ ని వెత‌క‌డానికి చాలా ఆలోచించాల్సి వ‌స్తోంద‌ట‌.  ఏ నటుడు అయితే ప్ర‌భాస్ కి ధీటైన విల‌న్ గా స‌రిపోతారు? అన్న‌ది తీక్ష‌ణంగా వెతకాల్సి వ‌స్తోంద‌ట‌.

ఇంత‌కుముందులా రొటీన్ విలన్లు అలాంటి పాత్రలు చేసే రోజులు పోయాయి. ఇప్పుడు ప్ర‌తిదీ కొత్త‌గా ఉండాలి. అందుక‌ని స్టార్ హీరోల్నే బ‌రిలో దించేస్తున్నారు. హీరోలు కూడా అందుకోసం ఎలాంటి భేష‌జం లేకుండా అంగీక‌రిస్తున్నారు. కాబ‌ట్టి సినిమాల స్థాయి మరో రేంజును తాకుతోంది. ఇది మేక‌ర్స్ కి తలనొప్పి వ్య‌వ‌హారంగా మారుతోంది.

ప్ర‌భాస్ న‌టిస్తున్న త‌దుప‌రి చిత్రాలలో విలన్లుగా జాక్ పాట్ కొట్టేది ఎవ‌రు? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. కానీ ఇప్ప‌టికి అయితే ధీటైన విల‌న్ల కోసం సెర్చ్ మొద‌లైంది.
Tags:    

Similar News