ఆర్జీవీ మిస్సింగ్ `పవర్ స్టార్`కి సీక్వెలేనా?
ఆర్జీవీ వర్సెస్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. పవర్ స్టార్ అంటూ సగం వండిన సినిమాతో పవన్ అభిమానులను కెలికిన ఆర్జీవీ.. ఇప్పటికీ జనసేనానిని విడిచిపెట్టినట్టు కనిపించడం లేదు. పవన్ రాజకీయాలపై సెటైర్లు వేస్తూ పవన్ ని వ్యక్తిగతంగానూ కించపరుస్తుండడంతో అభిమానులు ఆర్జీవీపై చాలా సీరియస్ గా ఉన్నారు.
ఇక ఇదే వేడిలో ఆర్జీవీ తెలివైన ప్లాన్ వేసాడు. పవన్ అభిమానుల వల్ల `పవర్ స్టార్` ఏటీటీ మూవీకి ఆదాయం అంతో ఇంతో లభించింది. ఇప్పుడు అదే అభిమానాన్ని క్యాష్ చేసుకునేందుకు పవర్ స్టార్ కి సీక్వెల్ తీస్తున్నాడని భావిస్తున్నారు. తాజా లీకుల్ని బట్టి `ఆర్జీవీ మిస్సింగ్` అంటూ వర్మ చేస్తున్న హంగామా రిలీజ్ చేస్తున్న పోస్టర్లు చూస్తుంటే ఇది సీక్వెలేనా? అన్న సందేహం కలగక మానదు. ఇందులో పవర్ స్టార్ కి కొనసాగింపు సన్నివేశాల్ని చూపిస్తున్నారని అర్థమవుతోంది.
పోస్టర్ లో ఇప్పటికే పవన్ కల్యాణ్ ని జైల్లో వేయించారు ఆర్జీవీ. తాను మిస్సవ్వడానికి కారణం పీకే ఫ్యాన్స్ .. మెగా ఫ్యామిలీ.. మాజీ సీఎం ఆయన కొడుకు అంటూ పోస్టర్ పైనే పోస్ట్ చేసి నానా రాద్ధాంతమే చేస్తున్నారు. ఫ్యాన్స్ వీక్ పాయింట్ పట్టుకుని తెలివిగా ఎన్ క్యాష్ చేయడం దీని ఉద్ధేశం అని అందరికీ అర్థమవుతోంది.
జనసేన అధ్యక్షుడినే టార్గెట్ చేయడం ద్వారా రాజకీయ వర్గాల్లోనూ చర్చకు తావిస్తున్నారు వర్మ. సినిమా సక్సెస్ సాధిస్తుందా లేక పరాజయం పాలవుతుందా? అన్న టెన్షన్ ఆర్జీవీలో అస్సలు కనిపించదు. బడ్జెట్ అన్నదే లేని సినిమాలు తీసి క్రియేటివిటీని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ అభిమానుల్ని వివాదాస్పద సన్నివేశాలతో చికాకు పెట్టే ప్రయత్నం చేస్తే ఈసారి సీరియస్ గా ఉంటుందని అభిమానులు వార్నింగుల ఇవ్వడం చూస్తున్నదే.
ఆర్జీవీ ప్రకటించిన అరడజను సినిమాల్లో ఆర్జీవీ మిస్సింగ్ మాత్రమే రిలీజ్ కి వస్తున్నట్టు అర్థమవుతోంది. తదుపరి ట్రైలర్ ద్వారా పవర్ స్టార్ మూవీకి కొనసాగింపు ఇదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్న అంచనాలు ఉన్నాయి. ‘పవర్ స్టార్’ క్లైమాక్స్ లో ఆర్జీవీ అర్థం కాని సందేశం తర్వాతా కొనసాగింపు ఉంటుందా? అన్నది ఆర్జీవీ మిస్సింగ్ సినిమా చూస్తే కానీ తెలీదు.
ఇక ఆర్జీవీ తెరకెక్కిస్తున్న సినిమాల్లో రిలీజ్ కి రానివి ఎన్నో. వీటిలో 12 ఓ క్లాక్ - దిశా ఎన్ కౌంటర్- కరోనా వైరస్- మర్డర్- ఎంటర్ ది గర్ల్ డ్రాగన్- డేంజరస్ వెయిటింగులో ఉన్నాయి. చట్టపరమైన అడ్డంకులు ఉన్నవి ఎప్పటికి రిలీజవుతాయి? అన్నది కోర్టుల్లో తేల్చాల్సి ఉంటుంది.