సెలబ్రిటీల విహారయాత్రల వెనుక అసలు రహస్యం అదేనా..?
కరోనా మహమ్మారి భయంతో ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. సినిమా షూటింగ్ లకు హాజరవుతూ బిజీగా మారిపోతున్నారు. అలానే లాక్ డౌన్ ఎత్తేసి ప్రయాణాలకు అనుమతి లభించడంతో విహారయాత్రలకు వెళుతున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది ప్రముఖులు హాలిడే ని ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు వెళ్లారు. ప్రశాంతమైన మాల్దీవుల బీచ్ లలో ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చేస్తున్నారు.
స్టార్ హీరోయిన్ కాజల్ కిచ్లు తన భర్తతో కలిసి హనీమూన్ కి అక్కడికే వెల్లడింది. అక్కినేని నాగచైతన్య- సమంత జంట సందడి చేసింది. మెహ్రీన్ తన ఫ్యామిలీతో కలిసి ఈ దీవుల్లో ఎంజాయ్ చేసొచ్చింది. ఇక తాప్సి అయితే అందరికంటే ముందే తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాల్దీవులకు వెళ్లి తిరిగొచ్చింది. షాహిద్ కపూర్ - మీరా రాజ్ పుత్.. దిశా పటానీ- టైగర్ ష్రాఫ్ ఈ సీజన్ లో మాల్దీవుల విహారం చేశారు. బిపాస బసు- కరణ్ సింగ్ గ్రోవర్.. జహీర్- సాగరిక జంట కూడా మాల్దీవుల విహారంలో చిలౌట్ చేశారు. అక్షయ్ కుమార్ - కత్రినా కైఫ్ - మాధురీ దీక్షిత్ - సోనాక్షి సిన్హా - వేదిక - ప్రణీత - నేహా ధూపియా వంటి వారు కూడా మాల్దీవులను చుట్టి వచ్చారు.
ఇలా సినీ ప్రముఖులు అందరూ పర్యాటకులకు భూతల స్వర్గధామంగా పేరుపొందిన మాల్దీవులకు వెళ్ళడానికి కారణం అక్కడ కరోనా ప్రభావం తక్కువగా ఉండటమే అని అనుకున్నారు. అయితే దీని వెనుక వేరే రహస్యం ఉందని తెలుస్తోంది. మాల్దీవులు ప్రభుత్వం సెలబ్రిటీలకు ఉచితంగానే అరేంజ్ మెంట్స్ చేయడమే దీనికి కారణమని ప్రచారం జరుగుతోంది. మాల్దీవులు టూరిజం డిపార్ట్మెంట్ పర్యాటక రంగాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలకు డిస్కౌంట్స్ ఇవ్వడంతో పాటు కొందరికి ఫ్రీ గా కూడా సదుపాయాలు కల్పిస్తున్నారట. వీరు అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వల్ల మాల్దీవుల టూరిజం మళ్ళీ పుంజుకుంటోందని తెలుస్తోంది.
నిజానికి చుట్టూ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు.. బీచ్ లు.. వెన్నెల రాత్రులు.. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేయడానికి అందరూ ఆసక్తి కనబరుస్తుంటారు. కరోనా కారణంగా ఇన్నాళ్లూ పర్యాటకులు దూరమైనప్పటికీ ఇప్పుడు మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది.