ఆ ప‌దిమంది బ‌డా నిర్మాత‌ల‌పై మండ‌లి పోరాట‌మా?

Update: 2020-12-17 05:03 GMT
డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లతో గిల్డ్ నిర్మాతలు కుమ్మక్క‌య్యారా? అందుకే నిర్మాత‌ల మండ‌లి కొంద‌రు పెద్ద‌ల ఆధిప‌త్యంపై పోరాటం త‌ల‌పెట్టిందా? ప‌్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ ఇది. మ‌ల్టీప్లెక్స్ లు ఇత‌ర థియేట‌ర్ల‌ని పునః ప్రారంభించే విష‌య‌మై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల ఓ కీల‌క స‌మావేశం జ‌రిగింది. తెలంగాణ రాష్ట్ర వాణిజ్య మండ‌లి జ‌రిపిన ఈ మీటింగ్ లో తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి.. నిర్మాత‌లు.. పంపిణీదారులు, సినిమా ఎగ్జిబిట‌ర్లు పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌ని చ‌ర్చించామ‌ని నిర్మాత‌ల మండ‌లి కార్య‌ద‌ర్శులు టి. ప్ర‌స‌న్న‌కుమార్‌, మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఈ నిర్ణ‌యాలు గిల్డ్ నిర్మాత‌ల‌కు వ్య‌తిరేకంగా వున్నాయ‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లతో గిల్డ్ నిర్మాత‌ల కుమ్మ‌క్కు కావ‌డం వ‌ల్లే నిర్మాత‌ల మండ‌లి తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గిల్డ్ నిర్మాత‌ల‌కు వ్య‌తిరేకంగా నిర్మాత‌ల మండ‌లి పెద్ద‌ల పోరాటం ప‌లుమార్లు బ‌య‌ట‌ప‌డింది. ఇప్పుడు మ‌రోసారి ఇదే పంథాలో వెళుతున్నారా? అంటూ చ‌ర్చ సాగుతోంది.

అస‌లింత‌కీ మండ‌లి కండీష‌న్లు ఏమిటి? అంటే.. డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్లకు నిర్మాత‌లు వ‌ర్చువ‌ల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్‌) చార్జీలు చెల్లించ‌రు.  కంటెంట్ ట్రాన్స్‌పోర్ట్ కోసం మాత్రం నిర్మాత‌లు నామ మాత్ర‌పు చార్జీలు చెల్లిస్తార‌ట‌. రెండు లేదా అంత‌కంటే ఎక్కువ సంవ‌త్స‌రాలుగా వినియోగంలో వున్న త‌మ ప్రొజెక్ట‌ర్ల‌ను ఆయా థియేట‌ర్ ఓన‌ర్‌లు కొనుగోలు చేయ‌డానికి వీలుగా డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లు ఆప్ష‌న్ ఇవ్వాలి. దీని వ‌ల్ల ప్ర‌క‌ట‌న‌ల ఆదాయాన్ని స్వీక‌రించ‌డానికి థియేట‌ర్ ఓన‌ర్స్ కు వీలు క‌లుగుతుంది.

థియేట‌ర్ యజ‌మానులు ప్రొజెక్ట‌ర్ల‌ను కొనుగోలు చేయ‌క‌పోతే నిర్మాత‌లు కొంత వ‌ర‌కు క‌ల్పించుక‌ని ప్రొజెక్ట‌ర్ల‌ను కొనుగోలు చేయ‌డానికి స‌హాయం చేస్తారు. మొద‌టి మూడు అంశాల‌కూ డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లు అంగీక‌రించ‌క‌పోతే థియేట‌ర్ య‌జ‌మానులువారి సొంత ప్రొజెక్ట‌ర్ల‌తో న‌డిపిస్తారు. కాగా ఈ స‌మ‌స్య‌ల‌పై గురువారం సాయంత్రం 4 గంట‌ల‌కు మ‌రోసారి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు నిర్మాత‌ల మండ‌లి తెల‌పడం ఆస‌క్తిక‌రంగా మారింది. డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లుగా ఉన్న నిర్మాత‌ల‌పైనే పోరాటం కావ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News