• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  SSMB28: మహేష్ సినిమా...

SSMB28: మహేష్ సినిమా సినిమాటోగ్రాఫర్ మారాడు..!!

By - Tupaki Desk
Update: 2022-07-09 11:30 GMT
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో గతేడాది అధికారికంగా ప్రకటించబడిన ఈ మూవీని ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. ఈ క్రమంలో సినిమా షూటింగ్ కు సంబంధించి మేకర్స్ శనివారం ఉదయం ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో వచ్చారు.

SSMB28 సినిమా ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్తుందని.. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు తెలిపారు. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. మహేష్ బాబు & త్రివిక్రమ్ ల ఎవర్ గ్రీన్ కాంబో మళ్లీ రాజ్యమేలబోతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేయబడిన వీడియోలో ఓ ఆసక్తికరమైన విషయం సినీ అభిమానుల దృష్టికి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ మారాడు. SSMB28 అనౌన్స్ మెంట్ వీడియోలో కెమెరామెన్ గా ఆర్. మది ని ప్రకటించారు. అయితే తాజాగా వచ్చిన అప్డేట్ లో పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారని పేర్కొనబడింది.

మహేష్ నటించిన 'శ్రీమంతుడు' చిత్రానికి మధి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల వచ్చిన 'సర్కారు వారి పాట' కు కూడా వర్క్ చేశారు. ఈ క్రమంలో మహేశ్ 28వ చిత్రంలో కూడా భాగం అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇంతలోనే అతని స్థానంలోకి PS వినోద్ వచ్చి చేశాడు.

'మనం' 'సోగ్గాడే చిన్ని నాయనా' 'ఊపిరి' 'ధృవ' 'హలో' వంటి సినిమాలకు పని చేసిన వినోద్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన 'అరవింద సమేత వీర రాఘవ' 'అల వైకుంఠపురములో' చిత్రాలకు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఈయన్నే 'వకీల్ సాబ్' కి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పీఎస్ వినోద్ ని తీసుకోడానికి మహేశ్ ని త్రివిక్రమ్ ఒప్పించారని టాక్ వినిపిస్తోంది.

ఆ మధ్య త్రివిక్రమ్ పర్యవేక్షణలో వచ్చిన 'భీమ్లా నాయక్' సినిమాకి కూడా కెమెరామెన్ మారిన సంగతి తెలిసిందే. ముందుగా 'అత్తారింటికి దారేది' ఫేమ్ ప్రసాద్ మూరెళ్ళని తీసుకోగా.. కొన్నాళ్ళు షూటింగ్ జరిగిన తర్వాత ఆయన స్థానంలోకి రవి కె. చంద్రన్ వచ్చి చేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్న SSMB28 షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే సినిమాటోగ్రాఫర్ మారిపోవడం గమనార్హం.

'అతడు' 'ఖలేజా' తర్వాత మహేశబాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. పవర్ ఫుల్ కథాంశంతో ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనుంది. ఇందులో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ (రాధాకృష్ణ) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.
Tags:    
  • SuperstarMaheshbabu 
  • SSMB28Film 
  • TollywoodFilm 
  • DirectorTrivikram 
  • PSVinodCinematography 
  • PoojaHegde 
  • Athadu 
  • Khaleja 
  • RMadhi 

Similar News

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS