స్టార్ హీరో భార్యామ‌ణి భ‌ర్త‌ వాట్సాప్ చెక్ చేస్తోందా?

Update: 2020-03-11 05:01 GMT
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మేల్ తో పాటు ఫీమేల్ ఫాలోవ‌ర్స్ బాగా ఎక్కువ‌. బ‌న్నీపై కొంద‌రు లేడీ ఫ్యాన్స్ క్ర‌ష్ చూపించ‌డం సోష‌ల్ మీడియాల్లో బ‌య‌ట‌ప‌డుతుంటుంది. త‌మ అభిమానాన్ని ప్రేమ రూపంలో వ్య‌క్త‌ప‌రిచిన గాళ్స్ క‌థ‌లు కోకొల్ల‌లు. కొన్నిసార్లు ప‌బ్లిక్ వేదిక‌ల‌పైనే బ‌న్నీ ప్లీజ్ ఒక్క‌సారి! అంటూ అమ్మాయిలు చేసే రచ్చ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మిగ‌తా హీరోల‌తో పోలిస్తే బ‌న్నీ ప‌బ్లిక్ వేదిక‌ల‌పై చూపించే ఉత్సాహం ఎన‌ర్జీకి క్రేజీ గాళ్స్ ఫిదా అయిపోతుంటారు.

నాగ‌చైత‌న్య‌..ప్ర‌భాస్..మ‌హేష్ వంటి స్టార్స్ పై గాళ్స్ అభిమానం వేరు అనుకుంటే.. బ‌న్నీపై మాత్రం వేరే రూపంలో ఉంటుంద‌ట‌. ఆ మ్యాట‌ర్ లో బ‌న్నీ మిగ‌తా హీరోలంద‌రికంటే ఎక్స్ క్లూజివ్ అన్న గుస‌గుస‌లు గాళ్స్ లో వినిపించాయి. ఇక ఈ ఫ్యానిజానికి బ‌న్నీ అంతే ఫిదా అవుతుంటాడట‌. సామాజిక మాధ్య‌మాల్లో అయితే త‌న‌దైన శైలిలో రిప్లై ఇస్తూ ఆక‌ట్టుకుంటాడు. బ‌న్నీ ఆల్రెడీ మ్యారీడ్. పైగా ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రి అయినా అత‌డి క్రేజ్ మాత్రం అమ్మాయిల్లో ఇసుమొత్తు కూడా త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ గాళ్స్ లో అదే క్రేజ్ ను కొన‌సాగిస్తున్నాడు. స్నేహ‌ను వివాహ‌మాడి తొమ్మిదేళ్లు పూర్త‌యింది. పెళ్ల‌య్యాక‌ బ‌న్నీ బాధ్య‌త‌ల్లో కొన్నిటిని స్నేహ తీసుకుంది.

ఆ క్ర‌మంలోనే బ‌న్ని సోష‌ల్ మీడియాల్ని స్నేహ‌నే మ్యానేజ్ చేస్తోంద‌ట‌. ఆ క్ర‌మంలోనే త‌న‌కు కొన్ని అరుదైన ఆస‌క్తిక‌ర‌మైన సంగ‌తులు తెలిసిపోయాయ‌ట‌. బ‌న్నీ లేడీ ఫ్యాన్స్ కి అప్పుడ‌ప్పుడు స్నేహ రిప్లై ఇస్తున్నా.. ఆ సంగ‌తి అటువైపు లేడీ ఫ్యాన్స్ కి తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల ఖంగు తినాల్సి వ‌స్తోంద‌ట‌. అయితే ఓ ఇంట‌ర్వూలో బ‌న్నీ త‌న లేడీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ త‌న‌ని అంత‌గా ఇబ్బంది పెట్ట‌లేద‌ని... చాలా హుందాగానే న‌డుచుకున్నార‌ని చెబుతుంటాడు. అప్పుడ‌ప్పుడు స్నేహ కంట్రోలింగ్ కూడా త‌న‌పై బాగానే ఉంటుంద‌ని... బార్డ‌ర్ దాట‌కుండా ఎక్క‌డ పెట్టాలో అక్క‌డ పెడుతుంది అంటూ క‌వ‌రింగ్ ఇచ్చేశాడు. ఆ విష‌యంలో స్నేహ చాలా తెలివైన‌ది అంటూ త‌న‌దైన శైలిలో న‌వ్వేసాడు. ఇక భార్యామ‌ణి త‌న‌ని బాగా అర్ధం చేసుకుంటుంద‌ని.. త‌మ మ‌ధ్య ఎలాంటి దాప‌రికాలు ఉండ‌వ‌ని అర్ధాంగి గురించి ఆకాశానికి ఎత్తేసాడు. అయితే బ‌న్ని గుట్టు మొత్తం స్నేహ‌వ‌ద్ద‌నే ఉందన్న‌మాట‌. త‌న గాళ్ ఫ్రెండ్స్ చిట్టా కూడా!! అన్న‌ట్టు బ‌న్ని వాట్సాప్ ని భార్య స్నేహ చెక్ చేస్తోందంటారా?
Tags:    

Similar News