రానా ఇంకా పెళ్లి మూడ్‌ లోనే ఉన్నావా?

Update: 2020-11-12 02:30 GMT
కరోనా కారణంగా దాదాపు ఆరు ఏడు నెలలు సినిమా పరిశ్రమలో పూర్తిగా స్థబ్దత నెలకొంది. చిన్న చిన్న సినిమాలు ఒకటి రెండు షూటింగ్‌ జరుపుకున్నాయి. కాని పెద్ద సినిమాలు ఏవీ కూడా షూటింగ్‌ కు వెళ్లలేదు. ఎట్టకేలకు సెప్టెంబర్‌ నుండి టాలీవుడ్‌ లో సినిమాల షూటింగ్‌ సందడి మొదలైంది. వరుసగా యంగ్‌ హీరోలు చిన్న హీరోలు పెద్ద హీరోలు స్టార్‌ లు సూపర్‌ స్టార్‌ లు అంతా కూడా షూటింగ్‌ లో జాయిన్‌ అవుతున్నారు. మరి కొందరు ఈ నెల లో షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉంది. అంతా షూటింగ్‌ లు మొదలు పెడుతున్నారు కాని రానా మాత్రం ఇప్పటి వరకు కెమెరా ముందుకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా అనిపించడం లేదు.

రానా ఆ సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ ప్రచారం అయితే జరుగుతుంది కాని ఇప్పటి వరకు ఆయన సినిమాలు ఏవీ కూడా మొదలు కావడం లేదు. రానా నటించిన అరణ్య సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. విడుదలకు సిద్దం అయిన సమయంలో కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. విడుదల ముందు ఆగిపోయిన సినిమాలన్నింటి కూడా ఓటీటీ లో రిలీజ్ అనో లేదా మరో విధంగానో వార్తల్లో నిలుస్తున్నాయి. కాని అరణ్య గురించి మాత్రం జనాలు కాని మీడియా కాని పట్టించుకుంటున్నట్లుగా కనిపించడం లేదు.

ఇక రానా విరాటపర్వం సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా గురించి గత ఏడాదిన్నరగా వార్తలు వస్తున్నాయి. అప్పుడప్పుడు ఏదో ఒకటి విడుదల చేసి హడావుడి చేస్తున్నారు తప్ప సినిమాను మొదలు పెట్టేందుకు మాత్రం రానా ఆసక్తి చూపుతున్నట్లుగా లేడు. ఇదే సమయంలో ఈయన పవన్‌ తో ఒక మలయాళ రీమేక్ లో కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాని పరిస్థితి ఏంటో ఇంకా ఏమీ తెలియరాలేదు. ఇటీవలే పెళ్లి చేసుకున్న రానా ఇంకా పెళ్లి మూడ్‌ లోనే ఉన్నాడేమో అని అందుకే ఇంకా షూటింగ్‌ లకు హాజరు అవ్వడం లేదు అంటూ టాక్‌ వినిపిస్తుంది.
Tags:    

Similar News