డార్లింగ్ మరోసారి తప్పు చేస్తున్నాడా..?

Update: 2020-04-14 09:30 GMT
డార్లింగ్ ప్రభాస్.. మొదటి నుండి కూడా సినిమా సినిమాకి విభిన్నమైన క్యారెక్టర్లను ఎంచుకుంటూ కొత్త కొత్త స్టైల్ ని పరిచయం చేస్తూ వస్తున్నాడు. అలాగే డార్లింగ్ - మిస్టర్ పర్ఫెక్ట్ - మిర్చి - సాహో సినిమాలలో తన హెయిర్ స్టైల్ - బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసారు దర్శకులు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తన తదుపరి చిత్రాలన్నీ ఆ లెవెల్ లోనే ఇండియా మొత్తం విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి - సాహో లాంటి భారీ వసూళ్లు రాబట్టిన సినిమాల తర్వాత డార్లింగ్ ప్రస్తుతం పీరియాడిక్ లవ్ డ్రామా మూవీలో నటిస్తున్నాడు.

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడట దర్శకుడు. ప్రభాస్ ని ఇంతవరకు చూడని లుక్ లో చూపిస్తానంటూ.. వివిధ రకాల అప్పటి పీరియాడిక్ టైంలో ఉండే లుక్స్ ట్రై చేస్తున్నాడట. 1960లోని గాఢమైన ప్రేమకథ కాబట్టి ఆ ట్రెండ్ కి తగ్గ లుక్స్ డిసైన్ ప్రత్యేకంగా చేస్తున్నారట చిత్రయూనిట్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతోన్నాయి. ఈ సినిమా కథ - ఇందులో హీరోహీరోయిన్ల పాత్రలు - సెట్స్ ఇలా ఎన్నో అంశాలు బయటికి వచ్చాయి.

తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ లీక్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర విషాదంతో ముగియనుందట. ఈ వార్త తెలిసిన అభిమానులు కంగారు పడుతున్నారు. అప్పట్లో చక్రం సినిమా విషయం లో కూడా అదే జరిగింది. విషాదంతో సినిమా పోయింది మరి ఈ సినిమా సంగతి ఏంటో అని సినీ వర్గాలలో చర్చలు మొదలయ్యాయి. యూవీ క్రియేషన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ - తమిళ బాషలలో రిలీజ్ కానుంది.
Tags:    

Similar News