'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రీ షూట్ చేయబోతున్నారా...?
అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఫస్ట్ లిరికల్ 'మనసా మనసా' అంటూ సిద్ శ్రీరామ్ ఆలపించిన సాంగ్ విశేష ఆదరణ పొందాయి. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'ని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావించారు. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఇదే అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కి కలిసి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
కాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా రఫ్ ఎడిటింగ్ అయిన ఔట్ పుట్ కింగ్ నాగార్జున చూశారని.. సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ అసంతృప్తిగా ఫీల్ అయ్యారని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి సినిమా చూసిన అల్లు అరవింద్ కి కూడా నచ్చకపోవడంతో రీ షూట్ చేయాలని డెసిషన్ తీసుకున్నారని న్యూస్ స్ప్రెడ్ అయింది. అమెరికా షెడ్యూల్ తప్పితే మిగతా పోర్షన్ మొత్తం బాగాలేదని.. మళ్ళీ రీ షూట్ చేయాల్సిందే అని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్నారట. దీనికి తగ్గట్టు ఈ సినిమాలో ఇప్పుడు దాదాపు 70 శాతం స్టోరీ మార్చేసి మళ్ళీ కొత్తగా రాస్తున్నారట. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ ఖాళీ సమయం దొరకడంతో అదే పని మీద ఉన్నాడట. ఇక ఈ సినిమా ఫలితంపై అఖిల్ తో పాటు 'బొమ్మరిల్లు' భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ఈ చిత్రంతోనైనా అఖిల్ సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు. మరి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా అక్కినేని వారసుడికి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుందో చూడాలి.