ట్రెండ్ ను ఫాలో అవ్వడంలో తప్పేంటి?
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారుతూ సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు చూస్తారని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ట్రెండ్ కు తగ్గట్లుగా కాకుండా సినిమాలను తమ ఇష్టానుసారంగా ఓల్డ్ ట్రెండ్ తో తెరకెక్కిస్తే జనాలు ఏం చేస్తారో ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాల ఫలితాలతో వెళ్లడి అయ్యింది. స్టార్ ఉన్నంత మాత్రాన భారీ బడ్జెట్ పెట్టినంత మాత్రాన సినిమాలు ట్రెండ్ కు తగ్గట్లుగా లేకుంటే చూస్తారు అనుకోవడం పెద్ద తప్పు అవుతుంది. అదే విషయాన్ని వెంకటేష్ కూడా నమ్ముతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. సినిమాల ట్రెండ్ తో పాటు ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ కూడా నడుస్తుంది. కనుక కాలంతో పాటు మనం మారాలనే ఉద్దేశ్యంతో తాను ఓటీటీ లో వెబ్ సిరీస్ ను చేసేందుకు ఓకే చెప్పినట్లుగా చెప్పుకొచ్చాడు.
సినిమాలు చేస్తూనే చాలా మంది స్టార్స్ ఓటీటీ ల్లో కనిపించేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే నాగార్జున ఒక వెబ్ సిరీస్ సబ్జెక్ట్ పై చర్చలు జరుపుతున్నట్లుగా ప్రకటించాడు. ఆ వెబ్ సిరీస్ మొదలు అయ్యేది ఎప్పుడా అంటూ అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో నెట్ ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ ను చేసేందుకు సిద్దం అయినట్లుగా వెంకటేష్ చెప్పేశాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు ఆ వెబ్ సిరీస్ ను ఆయన రానాతో కలిసి చేయబోతున్నాడట.
వెంకటేష్ మరియు రానాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్స్ పలువురు నటించబోతున్నట్లుగా చెబుతున్నారు. మంచి సబ్జెక్ట్ అవ్వడం వల్ల ఆ వెబ్ సిరీస్ కు ఓకే చెప్పానంటూ వెంకటేష్ చెప్పుకొచ్చాడు. ముందు ముందు మంచి సబ్జెక్ట్ లు తనవద్దకు వస్తే తప్పకుండా వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఓకే చెప్తాను అన్నాడు. ఓటీటీ కంటెంట్ విషయంలో కొందరు హీరోలు చిన్న చూపు చూస్తున్న ఈ సమయంలో వెంకటేష్ హుందాగా తాను మంచి సబ్జెక్ట్ వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ చెప్పడం అభినందనీయం అంటూ మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే అయిదు ఆరు సంవత్సరాల్లో టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ఓటీటీ కంటెంట్ లో నటించేందుకు ఓకే చెబుతూ ఉంటారని సినీ విశ్లేషకుల అంచనా.