• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ తో పవన్ సినిమా...

చరణ్ తో పవన్ సినిమా ఉంటుందా ?

By - Tupaki Desk
Update: 2019-06-21 06:45 GMT
అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ స్వంత బ్యానర్ లో రామ్ చరణ్ సినిమా చేస్తాడనే వార్త గట్టిగా ప్రచారంలోకి వచ్చింది. నిజానికి పవన్ కు ఆ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అన్నయ్య చేసిన ముగ్గురు మొనగాళ్ళుకు నిర్మాతగా వ్యవహరించిన పవన్ ఆ తర్వాత నాగబాబుకి నిర్మాణం వదిలేసి తను పూర్తిగా నటన వైపు దృష్టి పెట్టాడు. త్రివిక్రమ్ తో స్నేహం కుదిరాకే మళ్ళి ప్రొడక్షన్ వైపు వచ్చారు.

జనసేన బలోపేతం చేయడం కోసం ఇకపై నటించను అని పవన్ ఖరాఖండిగా చెబుతున్నా ఎప్పుడో అప్పుడు చేయకపోడా అని అభిమానులైతే ఆశలు పెట్టేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఎలాగూ తీరిక సమయం ఉంది కాబట్టి చరణ్ తో ప్రాజెక్ట్ గురించి పవన్ సీరియస్ గా అలోచిస్తున్నట్టు టాక్. ఆర్ఆర్ఆర్ కు ఇంకో ఏడాది పడుతుంది. చెర్రి ఇంకా ఎవరికి పర్సనల్ గా కమిట్ కాలేదు

సో అన్ని కుదిరితే పట్టాలు ఎక్కే ఛాన్స్ లేకపోలేదు. బాబాయ్ అడగాలే కాని అబ్బాయ్ దర్శకుడు ఎవరు అని చూడకుండా మరీ ఓకే చెబుతాడు. పవన్ మాత్రం త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే ప్లాన్ చేస్తున్నాడట. కాకపోతే ఇదంతా కొలిక్కి రావడానికి టైం పట్టేలా ఉంది. అల్లు అర్జున్ మూవీ ఫినిష్ అయ్యాక త్రివిక్రమ్ ఎవరితో చేస్తారు అనేది క్లారిటీ లేదు.

మహేష్ బాబు కూడా కథ కుదిరితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నాడు. మరోవైపు కొరటాల శివ సినిమా తర్వాత తనతో ఒకటి చేయమని చిరంజీవె స్వయంగా అడిగారు. సో ఇక్కడ పెద్ద చిక్కుముళ్ళే ఉన్నాయి. ఒకవేళ లెక్కలు మారి వేరే డైరెక్టర్ లైన్ లోకి వచ్చినా పవన్ మాత్రం చరణ్ తో నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేయాలనే ఆలోచన గట్టిగా చేస్తున్నాడట. ఇది పుకారా లేక నిజమా ఇంకా తేలాల్సి ఉంది

    

Tags:    
  • Ram Charan 
  • Pawan Kalyan 
  • Movie News 
  • Latest news 

Similar News

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS