• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ సెటైర్ టాప్...

మెగాస్టార్ సెటైర్ టాప్ డైరెక్టర్స్ మీదేనా?

By - Tupaki Desk
Update: 2020-01-07 06:54 GMT
ఈమధ్యే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. మహేష్.. విజయశాంతి.. అనిల్ రావిపూడి ఇలా అందరి గురించి ఎంతో అందంగా మాట్లాడారు. మహేష్ నవ్వు వెనక చిలిపిదనం ఉందని.. 'నా హీరోయిన్ విజయ శాంతి' అంటూ మెగా స్టైల్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమం లోనే తన నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు 80 రోజులే పట్టిందని.. అతితక్కువ సమయంలో పూర్తి చేశారని దర్శకుడు అనిల్ రావిపూడిని మెచ్చుకుంటూనే తన తదుపరి చిత్ర దర్శకుడు కొరటాల శివకు ఒక డెడ్లైన్ పెట్టారు. మన సినిమాను వంద రోజుల్లోనే పూర్తి చేయాలని 99 రోజు వరకూ కూడా షూటింగ్ కొనసాగకూడదని ఎంతో లౌక్యంగా కొరటాలను సినిమా త్వరగా పూర్తి చేసేలా కమిట్ చేయించారు. అయితే చిరంజీవి కామెంట్లు కొరటాల శివను మాత్రమే ఉద్దేశించినవి కాదని రాజమౌళి లాంటి ఇతర స్టార్ డైరెక్టర్లను ఉద్దేశించినవని అంటున్నారు.

ఈమధ్య స్టార్ డైరెక్టర్లు అందరూ ఒక్కో సినిమాకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ళ సమయం తీసుకుంటున్నారు. దీనివల్ల బడ్జెట్ పెరుగుతోందని.. నిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కంప్లైయింట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఇలా ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు సినిమా హిట్ అయితే అందరికీ సంతోషమే. కానీ సినిమా ఫ్లాప్ అయితే అందరికీ నష్టమే. అందుకే వీలైనంత తక్కువ సమయం లో సినిమాలు పూర్తి చేస్తే బడ్జెట్ పై అదుపు ఉంటుందని.. వడ్డీలు కూడా తగ్గుతాయని.. నిర్మాతలపై భారం తగ్గుతుందని సినీ పెద్దలు అంటుంటారు.

మరి మెగాస్టార్ చెప్పిన మాటను ఎవరు వింటారో.. ఎవరు పట్టించుకుంటారో.. ఎవరు ఆచరిస్తారో చూడాలి. నిజానికి ఒక సినిమా త్వరగా పూర్తి కావాలంటే డైరెక్టర్ వైపు నుంచి ప్రయత్నం మాత్రమే సరిపోదు. హీరోల వైపు నుంచి కూడా సహకారం అందాలి. లేకపోతే సినిమాను షెడ్యూల్స్ ప్రకారం పూర్తి చెయ్యడం చాలా కష్టం. దర్శకుల చొరవ.. హీరోల సహకారం ఉంటేనే అది సాధ్యమవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.


Tags:    
  • Is Chirus satire aimed at Rajamouli 
  • Sarileru Neekevvaru 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS