ట్రైలర్ టాక్: ఐపీ మ్యాన్ 4 .. కుంగ్ ఫూ ట్రీట్
మార్షల్ ఆర్ట్స్.. కుంగ్ ఫూ నేపథ్యంలో సినిమాలకు యువతరంలో ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. భారీ యాక్షన్ .. గగుర్పొడిచే విన్యాసాలతో తెర ఆద్యంతం రక్తి కడుతుంది. హాలీవుడ్ లో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఎన్నో భారీ చిత్రాలు వచ్చి సంచలన విజయాలు సాధించాయి. ఇక చైనా- హాంకాంగ్- బ్యాంకాక్- కొరియా- అమెరికా దేశాలకు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. చైనా కుంగ్ ఫూ విద్యకు పుట్టినిల్లుగా పాపులరైంది. బోధిధర్మ సిద్ధాంతం.. అరుదైన కుంగ్ ఫూ విద్య ఇండియా బార్డర్ లోనే పుట్టినా చైనా దానిని అడాప్ట్ చేసుకోవడంలో అందరినీ డామినేట్ చేసింది. చైనాతో హాంకాంగ్ అనుబంధం నేపథ్యంలో కొందరు మార్షల్ ఆర్ట్స్ గురువులు అక్కడ స్థిరపడ్డారు.
ఆ క్రమంలోనే ప్రపంచీకరణ పేరుతో ఈ ప్రపంచాన్ని కబ్జా చేయాలనుకున్న అమెరికా దాహం అన్ని కోణాల్లోనూ కొనసాగింది. స్పోర్ట్స్ .. మార్షల్ ఆర్ట్స్ లో చైనీయుల డామినేషన్ ని అంగీకరించలేని పరిస్థితి ఏర్పడింది. ఒలింపిక్స్ సహా మార్షల్ విద్యల్లో అన్నిచోట్లా చైనా డామినేషన్ సాగడాన్ని ఆ దేశం ఇప్పటికీ స్వాగతించలేదు. కారణం ఏదైనా మార్షల్ ఆర్ట్స్ విద్యలో చైనాను కొట్టడంలో అమెరికా ఎప్పుడూ వెనకబడే ఉంది. తమ దేశంలో మార్షల్ విద్యల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రయత్నించినా చైనా- హాంకాంగ్ వీరుల్ని టచ్ చేయడం కుంగ్ ఫూ లాంటి అరుదైన విద్యలో అంత సులువేమీ కాదని ప్రూవైంది. ఆ క్రమంలోనే అమెరికా విలన్ గా మారితే చైనా హీరోగా మారింది.
సరిగ్గా ఇదే పాయింట్ ని అడాప్ట్ చేస్తూ `ఐపీ మ్యాన్` ఫ్రాంఛైజీని హాంకాంగ్ - చైనా- అమెరికా దేశాల నేపథ్యంతో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ప్రముఖ కుంగ్ ఫు మాస్టర్.. `వింగ్ చున్ స్కూల్` డీన్ మిస్టర్ ఐపీ మ్యాన్ అమెరికా వెళతాడు. ఆ క్రమంలో అక్కడ తన విద్యార్థులు స్థానిక మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులతో గొడవపడడం.. ఆ క్రమంలోనే వారిని సేవ్ చేసే యోధుడిగా ఐపీ మ్యాన్ సత్తా చాటడం అనే సన్నని లైన్ తీసుకుని తెర ఆద్యంతం కుంగ్ ఫూ ఫైట్ తో ఐపీమ్యాన్ 4 చిత్రాన్ని తెరకెక్కించారు. డానీ ఎన్- స్కాట్ అడ్కిన్స్ తదితరులు నటించగా.. విల్సన్ ఇప్ దర్శకత్వం వహించారు. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజవుతోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఆద్యంతం మార్షల్ విద్యలతో రక్తి కట్టించింది.
Full View