• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : అక్కినేని హీరో...

వీడియో : అక్కినేని హీరో మూవీ ఇంట్రెస్టింగ్‌ గ్లిమ్స్‌

By - Tupaki Desk
Update: 2022-06-15 05:50 GMT
అక్కినేని ఫ్యామిలీ నుండి టాలీవుడ్‌ లో నాగార్జున తర్వాత అడుగు పెట్టిన సుమంత్‌ కమర్షియల్‌ గా సక్సెస్ అవ్వలేక పోయాడు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలకు పైగానే అయినా ఇప్పటి వరకు ఒక మంచి హిట్ ను దక్కించుకోవడం కాని.. ఒక మంచి బ్లాక్‌ బస్టర్ ను అందుకోవడం కాని జరగలేదు. నటుడిగా కొన్ని సినిమాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. కాని కొన్ని సినిమాలు మాత్రం ఆయన స్టార్ డమ్‌ ను దిగజార్చాయి.

ఎన్ని ప్లాప్ లు పడ్డా కూడా ఇండస్ట్రీలో మనుగడ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా రెండు మూడు సినిమాలను ఈయన చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అందులో ఒకటి అహం రీబూట్‌. టైటిల్ చాలా విభిన్నంగా ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి సుమంత్‌ యొక్క ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు సినిమా యొక్క నేపథ్యం మరియు కాన్సెప్ట్‌ ను తెలియజేస్తూ గ్లిమ్స్ ను విడుదల చేయడం జరిగింది.

సుమంత్‌ ఈ సినిమాలో రేడియో జాకీగా కనిపించబోతున్నాడని ఈ వీడియోను చూస్తే అర్థం అవుతుంది. ఆఫర్ట్‌ పార్టీ అనే టాక్ షో తో రేడియో లో ఆన్ ఎయిర్ ఉండగా ఒక అమ్మాయి నుండి కాల్‌ వచ్చి.. దయచేసి కట్ చేయవద్దు.

నేను డేంజర్ లో ఉన్నాను... నన్ను కిడ్నాప్‌ చేశారు.. కాపాడండి అంటూ కోరుతుంది. దాంతో వెంటనే హీరో ఏం చేస్తాడు.. అసలు ఆ అమ్మాయి ఎవరు అనే విషయాలను సినిమాలో చూడాల్సిందే.

ఎలక్ట్రానిక్‌ మీడియా ఎక్కువ అయిన ఈ సమయంలో రేడియోలు చాలా తక్కువ మంది మాత్రమే వింటున్నారు. అలాంటి రేడియో బ్యాక్ డ్రాప్‌ తో ఈ సినిమా రూపొందిన నేపథ్యంలో ఖచ్చితంగా చాలా ప్రత్యేకంగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హీరోగా సుమంత్‌ కు ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం కాని ఒక మంచి సినిమా గా అయితే నిలుస్తుందేమో అనిపిస్తుంది.

ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌ తో పాటు గ్లిమ్స్ తోనే ఆకట్టుకోవడంతో అహం రీబూట్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. అన్ని  వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.


Full View

Tags:    
  • AkkineniFamily 
  • Sumanth 
  • TollywoodFilms 
  • AhamRebootMovie 
  • AhamRebootFirstGlitch 
  • AkkineniSumanth 
  • FilmIndustry 

Similar News

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS